SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Hyderabad Ivf Scam Illegal Egg Donation 7 Centers Raids

హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ దందా.. 7 సెంటర్లకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్ నగరం కేంద్రంగా సాగుతున్న ఒక భయంకరమైన, చీకటి దందా వైద్య ఆరోగ్య శాఖ దాడుల్లో బట్టబయలైంది. అమాయక, నిరుపేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ, చట్టవిరుద్ధంగా అండాలను సేకరిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం బయటకు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను ఇక్కడికి రప్పించి, భారీగా డబ్బులు ఆశచూపి వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నIVF, ART కేంద్రాలపై ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుపాదం మోపుతోంది. ఈ దందా వెనుక ఉన్న బడా బాబులు ఎవరు? ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటి..?

ఈ ముసుగులో జరుగుతున్న అక్రమాలను లోతుగా విచారించడానికి, నిందితులను పట్టుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏకంగా 10 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దించింది. గత నాలుగైదు రోజులుగా ఈ టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ కేంద్రాల్లో అత్యంత ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 ఏఆర్‌టీ కేంద్రాలు ఉండగా, ఇప్పటివరకు 27 కేంద్రాల్లో దాడులు పూర్తి చేశారు. అందులో షాకింగ్ విషయమేమిటంటే.. ఏకంగా 7 కేంద్రాల్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎవిడెన్స్ తో సహా బయటపడింది. ఈ తనిఖీల సమయంలో అండాలు దానం చేస్తున్న 31 మంది మహిళలను అధికారులు గుర్తించి వారిని వ్యక్తిగతంగా విచారిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో ఈ దందాకు సంబంధించి మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేద మహిళలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపడమే కాకుండా, చట్టపరమైన నిబంధనలను తప్పించుకోవడానికి నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ఈ దందాను నడిపిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్‌లోని కొన్ని కేంద్రాలు ఒకే మహిళ నుంచి నిబంధనలకు విరుద్ధంగా పలుమార్లు అండాలు సేకరిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఈ అక్రమ నెట్‌వర్క్ నడుపుతున్న ప్రధాన సూత్రధారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయా ఐవీఎఫ్ కేంద్రాలకు నోటీసులు జారీ చేసి, ల్యాబ్‌ల్లోని ఆధార్ కార్డులు, అంగీకార పత్రాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలన చేస్తున్నారు.

Join Our Whatsapp Channel

ఈ అక్రమ దందాపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అండాల సేకరణలో డాక్టర్లు, ఐవీఎఫ్ సెంటర్లు, మధ్యవర్తుల పాత్రపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న వైద్యాధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి ‘నేషనల్ ఏఆర్‌టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీ’ని సందర్శించింది. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ఏఆర్‌టీ కేంద్రాలు, అండాల బ్యాంకుల పూర్తి డేటాను సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ద్వారా త్వరలోనే నివేదిక రూపంలో పొందనున్నారు.

మధ్యవర్తుల మాయమాటలు, ఆర్థిక ప్రలోభాలకు లోనై అమాయక మహిళలు తమ ఆరోగ్యాలను బలి చేసుకోవద్దని వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడే ఏ ఒక్క ఆస్పత్రిని లేదా ఏఆర్‌టీ కేంద్రాన్ని విడిచిపెట్టేదే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మెడికల్ రంగానికి కలంకం తెచ్చే ఇలాంటి దందాలపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల త్వరలోనే పూర్తి నిజాలు బయటకు రానున్నాయి.

Tags :

  • ART Centers
  • Breaking News
  • Egg Donation Scam
  • Health Department
  • Hyderabad Crime
  • hyderabad news
  • Illegal Egg Donation
  • IVF Centers
  • IVF Scam
  • Medical Scam
  • Telangana News
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైటెన్షన్ తీగలకు చిక్కుకున్న రష్యా టూరిస్ట్..

పారాగ్లైడింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. 200 అడుగుల ఎత్తులో కరెంట్ వైర్లకు చిక్కుకున్న టూరిస్ట్!

  • అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపటి నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ షురూ

    కొత్తగా పెన్షన్ అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ!

  • పొగ మంచు కారణంగా హైవేపై 50 వాహనాలు ఢీ.. 10 మంది దుర్మరణం

    పొగమంచుతో ఘోర ప్రమాదం.. ఒకేసారి 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. APSDMA కీలక హెచ్చరిక

    బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన APSDMA!

  • లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య..

    లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

  • ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్.. PJ.2.1 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

  • హేమంత్ కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు.. తొలగించిన కాలు భద్రపరచాలని ఆదేశం!

  • రేషన్ షాపుల్లో భారీ డిస్కౌంట్.. రూ.100కే కందిపప్పు.. రూ.125కే పామాయిల్..!

  • తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు? నవంబర్ 13 నుంచి కీలక మార్పులు!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam