తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా పెన్షన్ అప్లయ్ చేసిన వారికి గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి నేటితో తెరపడింది. రేపటి పెన్షన్ల పంపిణీకి ప్రక్రియ ప్రారంభించింది. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు, వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు, సెర్ప్ సీఈఓకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అధికారిక ఆదేశాల ప్రకారం, కొత్తగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పించన్ల పంపిణీని రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు అత్యంత పంపిణీ చేయనున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఇందుకోసం యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా, లబ్ధిదారుల ఖాతాలకు లేదా నేరుగా చేతికి పెన్షన్ సొమ్ము అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పంపిణీ షెడ్యూల్ అధికారికంగా వెలువడటంతో లబ్ధిదారుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలాంటి జాప్యం జరగకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల వెరిఫికేషన్, ఆమోద ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, సెర్ప్ సీఈఓ నుంచి అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడి దరఖాస్తులను పరిశీలించారు. ఏ ఒక్క అర్హడైన పెన్షన్ దారుడికి కూడా ఈ సంక్షేమ పథకం నుంచి మిస్ కాకూడదనే కఠిన నిబంధనలతో ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు.
కొత్తగా మంజూరైన ఈ పెన్షన్లను ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని స్పష్టమైన సూచనలు వచ్చాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేయనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళా చేనేత కార్మికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రత్యేక కౌంటర్లు, తాగునీరు వంటి కనీస వసతులు కూడా కల్పిస్తున్నారు.
మొత్తానికి ఇన్నాళ్లు పెన్షన్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వారికి మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. రేపటి నుంచి మొదలుకానున్న ఈ మహా యజ్ఞం ఈనెల 18వ తేదీ వరకు సజావుగా కొనసాగనుంది. కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ సంబంధిత మండల కేంద్రాలు లేదా మున్సిపాలిటీ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.
