హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా బాణసంచా ప్రమాదాల కలకలం రేగింది. రంగురంగుల చిచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు పేలుస్తూ ఆనందంగా గడపాల్సిన పండుగ రోజున.. బాధితులు ఆసుపత్రి బెడ్లపై కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు గ్రేటర్ పరిధిలో దీపావళి ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి..? ఎంతమంది గాయపడ్డారు..? మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
దీపావళి సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాణసంచా నిప్పురవ్వలు పడి కూకట్పల్లి, జీడిమెట్ల, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పలు షాపులు, గోడౌన్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురుస్వల్పంగా గాయపడ్డారు.ఇదిలా ఉంటే.. మెహెదిపట్నంలోని ప్రముఖ ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాధితులు వరుస కడుతున్నారు. దీపావళి సంబరాల వేళ బాణసంచా కాల్చడం వల్ల కంటి చూపుకు తీవ్ర విఘాతం కలిగించేలా గాయపడిన 15 మంది బాధితులు అత్యవసర చికిత్స కోసం ఈ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. వీరి పరిస్థితిని పరిశీలించిన వైద్యాధికారులు.. ఐదుగురి కంటి గాయాలు తీవ్రంగా ఉండటంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని ఐసోలేటెడ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మిగిలిన పదిమందికి ప్రాథమిక వైద్యం చేసి, అవసరమైన మెడిసిన్స్ ఇచ్చి తదుపరి చెకప్ కోసం మళ్లీ రమ్మని సూచించారు.
“ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆ ఐదుగురి వివరాలు పరిశీలిస్తే గుండె కలచివేసే నిజాలు బయటపడ్డాయి. అందులో నలుగురు చిన్న పిల్లలు కాగా, ఒక్కరు మాత్రమే వయసు మళ్లిన పెద్దవారు ఉన్నారు. పండుగ సరదా చిన్నారుల జీవితంలో ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అయితే, అదృష్టవశాత్తూ వీరెవరికీ శాశ్వతంగా చూపు పోయేంతటి తీవ్రమైన డ్యామేజ్ జరగలేదని డాక్టర్లు చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం. రాబోయే వీకెండ్లో పండుగ వేడుకలు మరిన్ని జరగనున్నందున బాధితుల సంఖ్య ఇంకా పెరిగే చాన్స్ ఉందని గ్రహించిన ఆసుపత్రి మేనేజ్మెంట్.. అందుకు తగ్గట్టుగా స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను, బెడ్స్‌ను అందుబాటులో ఉంచింది.”
“సరోజినీ దేవి ఆసుపత్రినే కాకుండా నగరం నలుమూలలా ఉన్న వివిధ ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కూకట్పల్లి, జీడిమెట్ల, కాటేదాన్ వంటి పారిశ్రామిక, నివాస ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే దాదాపు 67 మందికి పైగా వివిధ స్థాయిల్లో బాణసంచా వల్ల గాయపడినట్లు సమాచారం అందుతోంది. బాంబులు సరిగ్గా పేలక దగ్గరకు వెళ్లడం, విచ్చలవిడిగా క్రాకర్స్ కాల్చడం వల్లే ఈ స్థాయిలో ఇన్సిడెంట్స్ జరిగాయి.”
“ఈ పండుగ సీజన్లో ప్రతి ఒక్కరూ అత్యంత కేర్‌ఫుల్‌గా ఉండాలని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు దగ్గరుండి పర్యవేక్షించడం విధిగా చేయాలి. అలాగే నేటి యూత్ చేతిలో బాంబులు పట్టుకుని కాల్చడం, రన్నింగ్‌లో రాకెట్లు వదలడం వంటి ప్రాణసంకటమైన సాహసాలు అస్సలు చేయవద్దు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం చీకట్లోకి నెట్టివేస్తుందని గుర్తుంచుకోండి.
