SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Narasaraopet Ballot Box Letters Railway Underpass Issue

బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Sun - 8 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పల్నాడు జిల్లా కౌంటింగ్ వేళ వింత ఘటన.. బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రం

పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఊహించని చిత్ర, విచిత్ర సంఘటనలు వెలుగు చూశాయి. అయితే, ఓట్లు లెక్కించాల్సిన బ్యాలెట్ బాక్స్‌ లో అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ఘటనే పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు హాలులో బ్యాలెట్ బాక్స్ తెరిచిన సిబ్బందికి ఓట్లతో పాటు కొన్ని లేఖలు, కరపత్రాలు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. ఇందులో భాగంగా సత్తెనపల్లి మండలం, కంకాణలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు సీల్ తీసి లెక్కింపు ప్రారంభించారు. ఓట్లను విడదీస్తున్న సమయంలో బ్యాలెట్ పత్రాలతో పాటు ప్రత్యేకంగా అచ్చయిన కొన్ని కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. మొదట్లో ఏవో ప్రచార పత్రాలు అనుకున్నప్పటికీ, వాటిని చదివిన కౌంటింగ్ స్టాఫ్ అక్కడున్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

కంకాణలపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రైల్వే గేటు వద్ద ప్రస్తుతం ఒక అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ నిర్మాణాన్ని “యు” ఆకారంలో డిజైన్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్షకాలంలో నీరు చేరడం, పెద్ద వాహనాలు తిరగలేకపోవడం వంటి సమస్యలు వస్తాయని వారు పేర్కొన్నారు. అందుకే “యు” ఆకారపు బ్రిడ్జికి బదులుగా, ప్రధాన రహదారికి నేరుగా అనుసంధానం అయ్యేలా స్ట్రెయిట్ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ గ్రామస్థులంతా కలిసి ఆ కరపత్రాలను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు.

Join Our Whatsapp Channel

గ్రామస్థులు కేవలం సమస్యను వివరించడమే కాకుండా, తమ ఆవేదనను నేరుగా రాష్ట్ర ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్న ప్రయత్నం చేశారు. ఈ సమస్యపై సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించాలని వారు తమ లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కౌంటింగ్ కవరేజ్ మీడియా ద్వారా ప్రతిఒక్కరికీ చేరుతుంది కాబట్టి, తమ గ్రామానికి జరిగే అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ప్లాన్ చేశామని స్థానికులు చెబుతున్నారు.

సాధారణంగా బ్యాలెట్ బాక్సుల్లో పొలిటికల్ పార్టీలపై కోపాలు, విమర్శలు లేదా డబ్బులు కనిపించడం చూస్తుంటాం. కానీ ఇలా ఒక మౌలిక వసతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికల ప్రక్రియను వాడుకోవడం నిజంగా ఒక వినూత్న ఆలోచన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో ప్రత్యక్షమైన ఈ కరపత్రాల వార్త ఇప్పుడు సోషల్ మీడియ లో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో, ఆ రైల్వే అండర్ పాస్ డిజైన్‌ను మారుస్తారో లేదో చూడాలి.

Tags :

  • Andhra Pradesh Latest News
  • ap news
  • Chandrababu Naidu
  • Kankanalapalli
  • Nara Lokesh
  • Narasaraopet News
  • Palnadu News
  • parishad elections
  • Pawan Kalyan
  • Railway Underpass
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • రాప్తాడు బాలికకు ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్..అండగా ఉంటామన్న లోకేశ్

    రాప్తాడు బాలికకు ఊరట.. ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్.. లోకేశ్ కీలక ప్రకటన!

  • మురసు తుఫాన్ ప్రభావం.. 4 రోజులు భారీ వర్షాలు

    ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • మెగా ఇంట పెళ్లి సందడి.. కిరణ్‌తో సాయిధరమ్ తేజ్ పెళ్లి ఫిక్స్.. డేట్ కూడా వచ్చేసింది!

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • నిద్రపోతే రూ.9 లక్షలు మీ సొంతం.. హాయిగా పడుకొని లక్షలు గెలిచిన బెంగళూరు మహిళ!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam