SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Ap Parishad Elections Invalid Postal Ballot Votes

ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

ఏపీ పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో వెలుగుచూసిన కొన్ని పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓట్లు వేసిన వారి కంటే చెల్లని ఓట్లే భారీగా పోలై అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అసలు ఓటు ఎలా వేయాలో తెలియక ఈ తప్పులు చేశారా లేక మరేదైనా కారణం ఉందా? అధికారులు అసలు ఎన్ని చెల్లని ఓట్లుగా తేల్చారు..?

పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే కొన్ని మండలాల్లో వెలువడిన లెక్కలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో మొత్తం 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు పూర్తయ్యాక చూస్తే టీడీపీకి 50, వైసీపీకి 54, స్వతంత్రులకు 11 ఓట్లు వచ్చాయి. కానీ, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఏకంగా 85 ఓట్లు చెల్లనివిగా తేలాయి. అంటే గెలిచే అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ. ఇదే జిల్లాలోని అనంతగిరి మండలంలో 137 ఓట్లకు గాను.. ఏకంగా 91 ఓట్లు చెల్లకుండా పోయాయి. సగానికి పైగా ఓట్లు తిరస్కరణకు గురవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది.

అన్నింటికంటే దారుణమైన పరిస్థితి ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో కనిపించింది. ఇక్కడ నమోదైన మొత్తం 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఏకంగా 64 ఓట్లు చెల్లనివిగా తేలడం గమనార్హం. అంటే కేవలం రెండే రెండు ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి, ఆ రెండు ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థికే పోలయ్యాయి. 66 మంది విద్యావంతులైన ఉద్యోగులు ఓటేస్తే అందులో 64 ఓట్లు వేస్ట్ కావడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే తిరుపతి జిల్లా రేణిగుంటలో 144 ఓట్లకు గాను బీజేపీకి 68, వైసీపీకి 55, నోటాకు 5 ఓట్లు రాగా.. అక్కడ 16 ఓట్లు చెల్లకుండా పోయాయి.

Join Our Whatsapp Channel

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేటప్పుడు సరైన డిక్లరేషన్ ఫారమ్ జతపరచకపోవడం, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ సరిగ్గా చేయించకపోవడం లేదా స్వైపింగ్ ఇంక్ మార్క్ స్పష్టంగా లేకపోవడం వల్ల ఈ ఓట్లు చెల్లకుండాపోతాయి. సాధారణంగా ఎన్నికల డ్యూటీలు నిర్వహించే అధికారులే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగిస్తారు. అలాంటిది బ్యాలెట్ పేపర్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగిందా? లేక ఎన్నికల నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని ఓట్లు తిరస్కరణకు గురయ్యాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా పరిషత్ ఎన్నికల పోస్టల్ లెక్కింపులో వెలుగుచూసిన ఈ ఘోరం ఇప్పుడు వైఫల్యాలపై నిలదీసేలా చేస్తోంది. సాధారణ ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించే ఉద్యోగులే తమ ఓటును సరిగ్గా వేసుకోలేక పోవడం విచారకరం. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు ఎంతో విలువైనది, అలాంటిది వందల సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పోస్టల్ బ్యాలెట్లో భారీగా నమోదైన చెలని ఓట్లపై ఇంతకు మీరేం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • ap news
  • Ap Politics
  • Election Counting
  • Invalid Votes
  • Kaikaluru
  • Koyyuru
  • parishad elections
  • Postal Ballot
  • telugu news
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కౌంటింగ్‌కు ముందు రోజే మరణించినా MPTCగా ఘన విజయం

గుండెపోటుతో కన్నుమూత.. ఎన్నికల్లో 352 ఓట్ల మెజారిటీతో గెలుపు.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాద ఘటన!

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు ..అమెరికా భారీ రివార్డ్

    ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

    పాత ఢిల్లీలో భవన ప్రమాదాలు.. వరుసగా కూలుతున్న కట్టడాలు.. ఇద్దరు మృతి!

  • ఏపీని కలవరపడుతున్న మరో తుఫాను.. ఆందోళనలో తీరప్రాంత ప్రజలు

    ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • నిద్రపోతే రూ.9 లక్షలు మీ సొంతం.. హాయిగా పడుకొని లక్షలు గెలిచిన బెంగళూరు మహిళ!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam