SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » America 20 Million Dollar Reward Iran Nuclear Secrets Trump

ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Sat - 7 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు ..అమెరికా భారీ రివార్డ్

అంతర్జాతీయ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అణు రహస్యాలను చేధించేందుకు అమెరికా అత్యంత వ్యూహాత్మక అడుగు వేసింది. ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక సమాచారం అందించిన వారికి ఏకంగా 20 మిలియన్ డాలర్ల భారీ రివార్డును ప్రకటించింది అమెరికా. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 166 కోట్ల రూపాయలు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ సంచలన ప్రకటనను విడుదల చేసింది. సమాచారం అందించిన వారికి భారీ రివార్డుతో పాటు, ప్రాణ రక్షణ కోసం అవసరమైతే పునరావాసం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది అమెరికా.

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ భారీ ఆఫర్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటిలో ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాల వివరాలు ఏమిటి? ఈ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని అమెరికా కోరింది. సమాచారం అందించే వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది.

అత్యంత సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ ‘సిగ్నల్’ యాప్ లేదా ‘టోర్’ ఆధారిత చానెల్స్ ద్వారా మాత్రమే ఈ సమాచారాన్ని రహస్యంగా పంపవచ్చని అమెరికా నిఘా వర్గాలు సూచించాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నిబంధనలను ఇరాన్ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, సెంట్రిఫ్యూజ్‌ల వంటి కీలక పరికరాల ఉత్పత్తి, నిల్వలపై పర్యవేక్షణ లేకుండా పోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారీ రివార్డు ప్రకటనకు కొద్దిసేపటి ముందే, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ విషయంలో తాము తీసుకున్న దూకుడు నిర్ణయాలను ఆయన సమర్థించుకున్నారు.

Join Our Whatsapp Channel

తాము గనుక ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే, ఈ రోజు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశమే ఉండేది కాదన్నారు. ఇరాన్‌కు గనుక అణ్వాయుధాలు చిక్కి ఉంటే, వారు వాటిని ఇజ్రాయెల్‌పై తప్పకుండా వాడేవారని అన్నారు ట్రంప్. గత ఎనిమిది నెలలుగా సాగుతున్న ఘర్షణల వల్ల ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఆ దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. అందుకే ఇప్పుడు చర్చలు, ఒప్పందం కోసం ఇరాన్ ఆరాటపడుతోంది. ట్రంప్ అంతటితో ఆగలేదు. మధ్య ఇరాన్‌లోని ‘పికాక్స్ మౌంటెన్’ వంటి ఒకటి రెండు రహస్య ప్రాంతాలపై తాము ఇంకా నిఘా పెట్టాల్సి ఉందని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ఆరోపణలను ఇరాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ట్రంప్ ప్రస్తావించిన ‘పికాక్స్ మౌంటెన్’ ప్రాంతానికి ఇరాన్ అణు కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. అమెరికా కేవలం ఇరాన్‌ను బద్నాం చేయడానికి, ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.మరోవైపు, ఉద్రిక్తతలను పెంచడం తమకు ఇష్టం లేదని ఇరాన్ సంకేతాలు పంపింది. ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ ఇటీవలే స్పష్టం చేయడం ఇక్కడ గమనార్హం. తాము అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే ఉన్నామని టెహ్రాన్ వాదిస్తోంది.

మొత్తానికి ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు, ఇప్పుడు అణు రహస్యాలను కొనుగోలు చేసేందుకు అమెరికా రూ. 166 కోట్ల భారీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. మరి అమెరికా వేసిన ఈ రివార్డు ఎరపై ఇరాన్ లోపల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇరాన్ అణు రహస్యాలు బయటపడతాయా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.

Tags :

  • America
  • Donald Trump
  • international news
  • Iran
  • Iran News
  • Iran Nuclear Program
  • Iran Nuclear Secrets
  • telugu news
  • Trump News
  • US Government
  • US Iran War
  • world news
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

పాత ఢిల్లీలో భవన ప్రమాదాలు.. వరుసగా కూలుతున్న కట్టడాలు.. ఇద్దరు మృతి!

  • ఏపీని కలవరపడుతున్న మరో తుఫాను.. ఆందోళనలో తీరప్రాంత ప్రజలు

    ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • చెన్నైలో YS అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక.. హాజరైన రాజకీయ, సినీ దిగ్గజాలు

    విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • ట్రంప్ అహంకారమే..ఓటమికి కారణం..!

    ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

  • హనుమాన్ హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. కాబోయే భార్య ఎవరో తెలుసా?

  • ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి సినిమా అవుట్? కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam