కాకా షూటింగ్ నుంచి వస్తుండగా ఘటన ముచ్చింతల్ వద్ద కారును ఢీకొట్టిన వ్యాన్ ప్రమాదంలో దెబ్బతిన్న శేఖర్ మాస్టర్ కారు తృటిలో తప్పిన పెను ప్రమాదం కారులోని శేఖర్ మాస్టర్ సహా అందరూ క్షేమం ఎవరికీ గాయాలు కాలేదన్న టీమ్ టాలీవుడ్లో తన మాస్ స్టెప్పులతో హీరోలందరినీ ఉర్రూతలూగించే స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ఈ రోజు ఉదయం ఒక ఊహించని షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ షూటింగ్ స్పాట్ […]
హైదరాబాద్ శివారు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. జిల్లెలగూడ దత్తునగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఈ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని రక్తపు మడుగులో చూసి షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని మీర్పేట్ పరిధిలో గల జిల్లెలగూడ దత్తునగర్‌లో విషాదకర ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న శ్రీ […]
హైదరాబాద్ నగరం కేంద్రంగా సాగుతున్న ఒక భయంకరమైన, చీకటి దందా వైద్య ఆరోగ్య శాఖ దాడుల్లో బట్టబయలైంది. అమాయక, నిరుపేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ, చట్టవిరుద్ధంగా అండాలను సేకరిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం బయటకు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను ఇక్కడికి రప్పించి, భారీగా డబ్బులు ఆశచూపి వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నIVF, ART కేంద్రాలపై ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుపాదం మోపుతోంది. ఈ దందా వెనుక ఉన్న బడా బాబులు […]
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తక్కుగూడ పరిధిలోని హర్షగూడకు చెందిన బెటాలియన్ కానిస్టేబుల్ శ్రీను ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ వేధింపులు భరించలేక అతడు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీను మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పహాడిషరీఫ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న తుక్కుగూడ పరిధిలోని హర్షగూడలో నివాసముంటున్న 31 సంవత్సరాల […]
పండగపూట హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్ లోని ఓ వైన్స్ షాపు వద్ద మద్యం సేవించేందుకు వెళ్లిన ఓ వ్యక్తిపై వైన్ షాప్ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాగరాజు అనే వ్యక్తి స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 […]
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా బాణసంచా ప్రమాదాల కలకలం రేగింది. రంగురంగుల చిచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు పేలుస్తూ ఆనందంగా గడపాల్సిన పండుగ రోజున.. బాధితులు ఆసుపత్రి బెడ్లపై కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు గ్రేటర్ పరిధిలో దీపావళి ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి..? ఎంతమంది గాయపడ్డారు..? మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దీపావళి సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాణసంచా నిప్పురవ్వలు పడి కూకట్పల్లి, జీడిమెట్ల, కాటేదాన్ […]
ప్రతిరోజూ ఉదయాన్నే మనం తాగే పాలు ఎంతవరకు సురక్షితం? మనం ఆరోగ్యంగా ఉండటానికి తాగే పాలల్లో ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారనే షాకింగ్ నిజం ఇప్పుడు మరోసారి బయటపడింది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం SOT పోలీసులు జరిపిన మెరుపు దాడిలో భారీ కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, విషపూరిత రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసలు ఈ కల్తీ పాలను […]
మెగా కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోంది! టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన సాయి దుర్గా తేజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కనున్నాడు. నవంబర్ 5వ తేదీన అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యుల సమక్షంలోఆయన నిశ్చితార్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘డియర్ తేజ్, కిరణ్.. […]
రాజధాని నగరం హైదరాబాద్‌పై ఒక నిశ్శబ్ద మహమ్మారి పడగ విప్పుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత 7 నెలల డేటాను పరిశీలిస్తే బయటపడిన నిజాలు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో నమోదైన క్యాన్సర్ కేసుల సంఖ్య ఏకంగా 35 వేలకు చేరుకుంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఏయే క్యాన్సర్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి? […]
మురసు తుఫాన్ సృష్టించిన వాతావరణ బీభత్సంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఏపీ తీరప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు కురుస్తున్న భారీ వర్షాలు, వీస్తున్న తీవ్ర ఈదురుగాలుల వల్ల వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారింది. దీంతో విమానయాన సంస్థలు అత్యవసరంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. మంగళవారం ఒక్కరోజే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఏకంగా 16 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని గన్నవరం, […]
