ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆయన తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, చేగొండి ఉమారాణి జనసేన పార్టీలో చేరారు. పార్టీ స్థానిక నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ పదవికి అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలిసి జనసేన పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనితీరు, గ్రామాల అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ తనను ఆకట్టుకున్నాయని అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి తెలిపారు. ఈ కారణంగానే తన భర్తతో కలిసి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దొడ్డిపట్ల సర్పంచ్ ఎన్నికల బరిలో ఉమారాణి నిలవడంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రుల రాజకీయ ప్రవేశం స్థానికంగా చర్చనీయాంశమైంది.తన తల్లి ఉమారాణి యలమంచిలి మండలం దొడ్డిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు అనంత శ్రీరామ్ తెలిపారు. గ్రామాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివృద్ధి చేస్తున్నారనే జనసేనలో తన తల్లిదండ్రులు చేరారని
తెలిపారు.
