SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Ayyappa Devotee 2000 Km Sashtanga Yatra Bengal To Sabarimala

ఒళ్లంతా నేలపై పెట్టి 2,000 KM యాత్ర..

  • Written By: Ayyappa Panja
  • Published Date - Fri - 20 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అయ్యప్ప భక్తుడి కఠోర దీక్ష.. 2 వేల కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర

సామాన్యులు ఊహించడానికి కూడా సాహసించలేని ఒక అసాధారణ భక్తి యాత్ర అది. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళలోని శబరిమల వరకు.. సుమారు 2,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం సాష్టాంగ నమస్కార యాత్ర ద్వారా పూర్తి చేయడానికి సంకల్పించాడు ఓ భక్తుడు. నడుస్తూనో, వాహనంపైనో కాకుండా కేవలం ‘సాష్టాంగ నమస్కారాలు’ చేసుకుంటూ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాడు. అచంచలమైన అయ్యప్ప భక్తి, గో సంరక్షణ అనే ఆశయంతో ఆరు నెలల క్రితం మొదలైన ఈ కఠోర యాత్ర.. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉలవపాళ్ల సమీపంలోని జాతీయ రహదారిపై కొనసాగుతోంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన తరుణ్ బెహరా అనే యువకుడు ఎలాంటి సహాయకులు లేకుండా ఒంటరిగానే ఈ మహా యాత్రకు శ్రీకారం చుట్టాడు. యాత్ర సాగే విధానం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. తన వెంట ఉన్న సైకిల్‌పై వంట చేసుకోవడానికి అవసరమైన చిన్న స్టవ్, నిత్యావసర దినుసులను పెట్టుకున్నాడు. ముందుగా తన సైకిల్‌ను కొంత దూరం తీసుకెళ్లి రోడ్డు పక్కన నిలబెడతాడు. మళ్లీ వెనక్కి నడిచి వచ్చి, ఎక్కడైతే సాష్టాంగ నమస్కారం ఆపాడో సరిగ్గా అక్కడి నుంచే మళ్లీ నేలపై పడుకుని దండాలు పెట్టుకుంటూ సైకిల్ వద్దకు చేరుకుంటాడు. ఇలా రోజుకు కొంత దూరం చొప్పున ఆరు నెలలుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ముందుకు సాగుతున్నాడు. శబరిమల చేరుకోవడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

హైవేపై ప్రాణాలకు తెగించి ఈ యువకుడు చేస్తున్న అకుంఠిత దీక్షను చూసి దారిన పోయేవారు ఆశ్చర్యపోతున్నారు. మార్గమధ్యలో అక్కడక్కడా స్థానిక యువకులు అతనికి అండగా నిలుస్తున్నారు. అతని సైకిల్‌ను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, జాతీయ రహదారిపై వాహనాల రద్దీ వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. భగవంతుడిపై నమ్మకం, గోమాతను రక్షించాలనే దృఢ
సంకల్పమే ఈ యువకుడి చేత ఈ అసమాన యాత్ర చేయిస్తున్నాయని స్థానికులు కొనియాడుతున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • 2000 KM Yatra
  • Andhra Pradesh News
  • Ayyappa Devotee
  • Ayyappa Swamy
  • Bhakti News
  • Devotional Journey
  • Nellore News
  • Sabarimala
  • Sashtanga Yatra
  • Tarun Behera
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసును రీ-ఓపెన్ చేసిన పోలీసులు

ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • నేడు తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం..

    బంగాళాఖాతంలో తుఫాన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలు అప్రమత్తం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం.. స్పై కెమెరాతో గర్భాలయంలోకి వెళ్లిన భక్తుడు..

    అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. లడ్డూ తయారీ కేంద్రంలో పేలిన గ్యాస్ సిలిండర్

    శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • ఏపీలో మళ్ళీ ఎన్నికల నగారా.. 23 స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

    ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేనలోకి..

  • ఒళ్లంతా నేలపై పెట్టి 2,000 KM యాత్ర..

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

Most viewed

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam