బిగ్ బాస్ హౌస్ అంటేనే డ్రామా, గొడవలు మాత్రమే కాదు… ప్రతి సీజన్ లోనూ అంతకుమించి అన్నట్టు ఒక లవ్ ట్రాక్ గ్యారెంటీగా కనిపిస్తుంది! అసలు ఈ ఇంట్లో అడుగుపెట్టాక ఎప్పుడు ఎవరి మనసులు కలుస్తాయో, ఎవరి మధ్య కళ్ళు కళ్ళు కలుస్తాయో ఎవరూ చెప్పలేరు. బయట ఎంత స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళయినా, ఈ హౌస్ లోకి వచ్చాక ఆటోమేటిక్ గా లవ్ లో పడిపోతుంటారు. మరి ఈసారి ఆ మాయలో పడబోయే ఆ ‘లవ్ బర్డ్స్’ ఎవరో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, ఈ సీజన్ లో కొత్తగా చిగురించిన చిగురించబోయే ఆ లవ్ స్టోరీ ఏంటో ఇప్పుడే చూసేద్దాం!”
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ వాతావరణం కాదు.. ఏకంగా ‘లవ్ తుఫాన్’ నడుస్తోంది! ప్రస్తుతం ఇంట్లోని కెమెరాలన్నీ మన రోహిత్, శాలిని వైపే ఫోకస్ పెట్టాయి. వీళ్లిద్దరి కళ్ల కదలికలు, అర్ధరాత్రి వేళ ఆ మూలల్లో కూర్చుని చెప్పుకునే సీక్రెట్ ముచ్చట్లు చూస్తుంటే… పక్కాగా వీళ్ల మధ్య గట్టి కనెక్షన్ సెట్ అయిందని ఇటు హౌస్ మేట్స్, అటు ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ, మొన్ననే ఎలిమినేట్ అయి బయటపడ్డ మన క్రిష్ణుడు మాత్రం ఈ సీన్ చూసి గట్టిగానే కడిగేశాడు! ‘తమ్ముడూ రోహిత్.. ఆ పక్క చూపులు, పక్కనున్న పాపని కాస్త పక్కన పెట్టి.. వచ్చిన గేమ్ ఏంటో చూసుకో నాయనా! ఈ ఫేక్ లవ్ ట్రాక్ వల్ల నీ పరువు పోయి, గ్రాఫ్ పాతాళానికి పడిపోతోంది’ అంటూ స్ట్రెయిట్ గానే క్లాస్ పీకాడు!
అటు చూస్తే మన సోషల్ మీడియా స్టార్ సుధీర్ రెడ్డి, సృష్టితో ఎలాగైనా లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలని తెగ ట్రై చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, సృష్టి నాలుగో వారమే ప్యాకప్ చెప్పేసి ఇల్లు ఖాళీ చేసింది. దాంతో సుధీర్ లవ్ ట్రాక్ కాస్తా.. స్టార్టింగ్ లోనే తుస్సుమంది! ఇక హౌస్ లో ఈ ముచ్చట్లన్నీ చూసి, మనోళ్లు ముఖేష్ గౌడకు ఏకంగా ‘ఉమెన్ ట్రాక్ విన్నర్’ అని టాగ్ తగిలించి ఓ రేంజ్ లో ఆటపట్టించేస్తున్నారు. ఈ పాత ట్రాకులు పక్కన పెడితే.. ఇప్పుడు హౌస్ లోకి కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నారట. వాళ్ళు వస్తే ఈ కెమిస్ట్రీ సమీకరణాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి! లోపల ఉన్నోళ్లు లవ్ ట్రాకులతో బిజీగా ఉంటే, బయట ఆడియన్స్ మాత్రం మాకు ఇలాంటి డ్రామా వద్దు కాస్త టాస్కుల్లో దమ్ము చూపించండి’ అని గట్టిగానే కోరుకుంటున్నారు!
