AI Jobs 2026 : మీరు చేసే ఉద్యోగం రేపు ఉంటుందా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్ని పూర్తిగా తినేస్తుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న అత్యంత భయానకమైన, ఆలోచింపజేసే ప్రశ్న ఇదే. టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ రాకతో భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోనుందని AI ఎక్స్ పర్ట్ క్లారా షిహ్ హెచ్చరిస్తున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి? క్లారా షిహ్ అంచనాల ప్రకారం కేవలం ఏయే మూడు రకాల జాబ్స్ మాత్రమే మిగులుతాయి..?
ఏఐ కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోని ప్రతి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదుగుతోంది. ముఖ్యంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్, డెలివరీ సర్వీసెస్ తో పాటు ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో మనుషులు చేసిన ఎన్నో పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ క్షణాల వ్యవధిలో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ హైరింగ్ పద్ధతులను పూర్తిగా మార్చుకుంటున్నాయి. కొత్తగా గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెక్ ఎక్స్ పర్ట్ క్లారా షిహ్ రాబోయే కాలంలో ఉద్యోగ రంగాన్ని కేవలం మూడు ప్రధాన వర్గాలుగా మాత్రమే విభజించవచ్చని అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, మనుషుల సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎప్పటికీ అవసరమే. అయితే సాధారణ, పునరావృతమయ్యే పనులన్నింటినీ పూర్తిగా ఏఐ ఆక్రమించుకుంటుందని, కాబట్టి శ్రామిక శక్తి తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్చ స్పష్టం చేస్తోంది.
కంపెనీలు ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకోవడానికి, ప్రొడక్టవిటి పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను గుడ్డిగా నమ్ముతున్నాయి. మనుషులతో పోలిస్తే ఏఐ తక్కువ సమయంలో ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలగడం వల్ల యాజమాన్యాలు రిక్రూట్మెంట్లో కోత విధిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల కార్మికులు, ఉద్యోగులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ఏయే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి? భవిష్యత్ ప్రపంచంలో ఏఐ యుగాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.
మొత్తానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఉద్యోగ రంగాన్ని సమూలంగా మార్చివేయడం ఖాయం. దీనికి భయపడటం కంటే, టెక్నాలజీకి తగినట్లుగా మనల్ని మనం మార్చుకోవడం ఉత్తమమని నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు
