SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ap Dsc 2026 Notification Teacher Jobs

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 14 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP DSC 2026 : ఏపీలోని నిరుద్యోగ యువతకు, ఏళ్లనుంచి టీచర్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ-2026 ప్రకటన విడుదలకావడంతో అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మంగళవారం విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఉన్న వేలాది ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరు ప్రకటనలను జారీ చేసింది.

ఈ డీఎస్సీ-2026 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలల పరిధిలోని 2,111 జనరల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ జనరల్ పోస్టుల్లో 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 1,205 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం 350 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను, వివిధ సంక్షేమ సొసైటీలు, మోడల్ స్కూళ్ల పరిధిలో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరీలకు సంబంధించి మరో 260 పోస్టులను నింపనున్నారు.

ఇక జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను పరిశీలిస్తే… పాఠశాల విద్య పరిధిలోని 2,111 పోస్టుల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 389 ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేక పోస్టులతో కలిపితే ఒక్క కర్నూలులోనే 404 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం జిల్లాలో 266, కడప జిల్లాలో 206, నెల్లూరులో 165, చిత్తూరులో 130, తిరుపతిలో 99 మరియు అనంతపురం జిల్లాలో 92 పోస్టులు ఉన్నాయి. ఇక అత్యంత తక్కువగా విజయనగరం జిల్లాలో 4, పార్వతీపురం మన్యం జిల్లాలో 8, అలానే పశ్చిమగోదావరితో పాటు ఏలూరు జిల్లాల్లో 10 చొప్పున ఖాళీలు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు వివిధ సంక్షేమ సొసైటీల పరిధిలోని 260 పోస్టుల్లో అత్యధికంగా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీలోనే 85 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులను మల్టీ జోన్ పరిధిలోకి, పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్‌గా పరిగణిస్తారు. ఇక ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ పోస్టులను ఇటీవలే ప్రభుత్వం స్థానిక కేడర్ పోస్టులుగా వర్గీకరించింది. ఈ నియామకాలకు సంబంధించి నవంబరు 3వ తేదీ నుంచి అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే విద్యాశాఖ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ఆ సమగ్ర నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు, విద్యార్హతలు, పరీక్షా తేదీల సమాచారాన్ని క్లియర్‌గా వెల్లడిస్తారు. కాబట్టి డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులంతా ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవడం ఉత్తమమని పలువురు సూచిస్తున్నారు.

Tags :

  • Andhra Pradesh Jobs
  • AP DSC 2026
  • AP DSC Notification
  • AP Government Jobs 2026
  • AP Teacher Jobs
  • DSC Recruitment
  • School Assistant Jobs
  • SGT Jobs
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam