Samakhya Global Business Meet 2026 : హైదరాబాద్లో జరుగుతున్న సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్కు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు మూడు వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 30 నుంచి 40 మంది ప్రముఖ వక్తలను ఆహ్వానిస్తున్నారు. ఖ్యంగా యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వచ్చింది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం, కొత్త వ్యాపార అవకాశాలను పరిచయం చేయడం, అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలతో అనుసంధానం చేయడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పలు సంస్థల్లో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా అనే సందిగ్ధత యువతలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి, స్టార్టప్లు, చిన్నతరహా పరిశ్రమలు, కొత్త వ్యాపారాల వైపు యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. క మంచి వ్యాపార ఆలోచన ఉన్నప్పటికీ పెట్టుబడి లేకపోవడం, సరైన మార్గదర్శకత్వం దొరక్కపోవడం, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలతో చాలామంది యువకులు వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వారికి అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తల సలహాలు, పెట్టుబడిదారులతో పరిచయాలు, అంతర్జాతీయ మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ వేదిక కానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ వ్యాపారవేత్తలను ఒక బలమైన నెట్వర్క్గా తీర్చిదిద్దాలన్నది సమాఖ్య లక్ష్యం. బిజినెస్ నెట్వర్కింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలపై ఈ రెండు రోజుల సదస్సులో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కవైపు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు అవకాశాలు, మరోవైపు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తల భాగస్వామ్యం, యువతకు కొత్త అవకాశాలను పరిచయం చేసే లక్ష్యంతో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ హైదరాబాద్లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
