‘బ్రో’ కలెక్షన్ల గురించిన న్యూస్ కూడా మీడియా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పవన్ కెరీర్‌లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ.. రూ. 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
చిన్న మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తేజ్, ఆరు నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా చిల్ అవుతున్నాడు. అయితే తేజ్ పక్కన ఉన్న కుర్రాడు హైలెట్ అయ్యాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. తమ గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా ఆరాధించే వారు లక్షల్లో ఉన్నారు. సినిమాల్లో ఆయన క్రేజ్, రేంజ్ వేరు. బాక్సాఫీస్‌ని షేక్ చేసే స్టామినా ఆయనది. ఫిలిం ఇండస్ట్రీలో కింగ్‌లా ఉండే పవన్ ప్రజలకు సేవ చేయాలని పాలిటిక్స్‌లోకి వచ్చారు.
వేరో భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి విడుదల చేయడం సినీ పరిశ్రమలో పరిపాటి. అలా ఇటీవల తెలుగులోకి రీమేక్ అయిన సినిమా ‘బ్రో’. దర్శకుడు సముద్ర ఖని నటించి, తెరకెక్కించిన తమిళ చిత్రం వినోదయ సీతంకు రీమేక్.
తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా కనిపించింది. మామూలు ధరలతోనే భారీ వసూళ్లు సాధించడం పవన్‌కే సాధ్యం అని మరోసారి నిరూపించిందీ చిత్రం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏరియాల వారీగా ‘బ్రో’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే (హైర్స్, జీఎస్టీ) కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ వైపు ‘బ్రో’ టికెట్స్ కోసం నానా హంగామా నడుస్తుంది. మరోవైపు రివ్యూల కోసం సెర్చింగ్ కూడా. ఇలాంటి హడావిడి టైంలో ఓటీటీ రిలీజ్ గురించిన న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీ భారీ అంచనాల మధ్య రేపు రిలీజ్ అవుతుంది.