సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు నడుస్తున్న ఒక పెద్ద లాస్ట్ మినిట్ ట్రెండ్‌కు సెన్సార్ బోర్డు గట్టిగా బ్రేకులు వేసింది. అవును, మీరు విన్నది నిజమే! ఇకపై మన స్టార్ డైరెక్టర్ల లాస్ట్ మినిట్ హడావుడికి, ఆఖరి నిమిషం వరకు థియేటర్ల దగ్గర టెన్షన్ పడే రోజులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు సినిమా రిలీజ్‌కు జస్ట్ కొద్దిరోజుల ముందే.. అసంపూర్తిగా ఉన్న ప్రింట్లను, అంటే ప్యాచ్ వర్క్‌లు మిగిలి ఉన్న అవుట్‌పుట్‌ను సెన్సార్ బోర్డుకు పంపించి, ఎలాగోలా సర్టిఫికెట్ తెచ్చుకునే అలవాటు మేకర్స్‌కు ఉండేది. కానీ, ఇప్పుడు సెన్సార్ బోర్డు ఈ పద్ధతికి పూర్తిగా కళ్ళెం వేసేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. సినిమా ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఫైనల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సబ్‌టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్తో సహా.. ఏ టెక్నికల్ వర్క్ కూడా పెండింగ్ లేకుండా పక్కాగా వంద శాతం పూర్తయిన ఫైనల్ వెర్షన్ ప్రింట్ ను మాత్రమే సెన్సార్ బోర్డుకు సమర్పించాలి. ఒకవేళ ఎడిటింగ్ లేదా సీజీ వర్క్ పెండింగ్‌లో ఉన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రింట్లను పంపిస్తే.. సెన్సార్ బోర్డు వాటిని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా, రివ్యూ చేయకుండానే నిర్మొహమాటంగా తిరస్కరిస్తుంది.
సాధారణంగా మన స్టార్ డైరెక్టర్లకు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు ఆఖరి నిమిషం వరకు సినిమాలో కరెక్షన్స్ చేస్తూనే ఉండే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉండే సినిమాలకైతే.. రిలీజ్ తేదీకి ముందు రోజు రాత్రి వరకు కూడా ల్యాబ్‌లలో సీజీ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. విదేశాల నుంచి గ్రాఫిక్స్ షాట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు. కానీ ఇకపై ఈ ఆటలు సాగవు. సినిమా ఫుల్ అండ్ ఫైనల్ కాపీ రెడీగా ఉంటేనే సెన్సార్ అప్లికేషన్ ముందుకు కదులుతుంది. దీనివల్ల ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ డేట్‌కు కనీసం రెండు, మూడు వారాల ముందే మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక దీంతో పాటు సెన్సార్ బోర్డు మరో విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అదే.. సినిమా టైటిల్స్! సాధారణంగా మేకర్స్ ఒక టైటిల్ అనుకుని, ఫస్ట్ లుక్ పోస్టర్లు వేసి హడావుడి చేస్తారు. కానీ సెన్సార్ బోర్డు ఏం చెప్పిందంటే.. ‘మేకర్స్ ప్రకటించిన పేరు ఫైనల్ కాదు, సెన్సార్ బోర్డు ఓకే చెప్పి సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఆ టైటిల్ అఫీషియల్ కానే కాదు అని స్పష్టం చేసింది. టైటిల్స్ విషయంలో ఏదైనా వివాదాలున్నా, లేదా రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
కాబట్టి, ఇండస్ట్రీ వర్గాలూ.. ఇకపై లాస్ట్ మినిట్ రష్ను నమ్ముకుంటే థియేటర్లలోకి సినిమా రావడం కష్టమే. ప్లానింగ్ మార్చుకోవాల్సిందే!
మరి సెన్సార్ బోర్డు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల సినిమాల క్వాలిటీ పెరుగుతుందా? లేక మేకర్స్‌కు ఇబ్బందులు ఎదురవుతాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
