హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించి.. నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. రూ.20 కోట్లతో తమ్మడికుంట చెరువు పూడికతీత, చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, పిల్లల క్రీడా స్థలం తీర్చిదిద్దారు. చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. చెరువు అభివృద్ధిలో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెలను కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు.
వర్క్ ఫ్రమ్ హోం లాగే వర్క్ ఫ్రమ్ లేక్ .. వెసులుబాటు తమ్మిడికుంట చెరువు అభివృద్ధితో నగరవాసులకు లభించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువు చెంతకు వచ్చి పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో పని చేసుకోవచ్చన్నారు. ఇంట్లో ఏసీ లేనిదే ఉండలేని పరిస్థితి ఉంటే.. చెరువు చెంత చల్లటి వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఇక్కడికి పిల్లా పాపలతో వచ్చిన కుటుంబాలకు, ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అల్లరి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారి పట్ల కఠినంగా వ్యవరించాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో ఒకవైపు శిల్పారామంతో పాటు ఇప్పుడు తమ్మిడికుంట సందర్శకులకు మంచి వేదికలౌతాయన్నారు.
తమ్మిడికుంటకు వచ్చినవారు చెరువు చుట్టూ నడిచి.. వ్యాయామాలు పూర్తి చేసుకుని.. నిత్యావసరాలైన కూరగాయలు, పాలు కొనుక్కుని వెళ్లేలా ఇక్కడ షాపులు పెట్టి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇలా లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి మహిళా సాధికారతకు చెరువులను వేదికలు చేయాలన్నారు. జమ్మి చెట్టును నాటి దసరా ఉత్సవాలకు, సంక్రాంతి సంబరాలకు తమ్మిడికుంట చెరువు వేదికవ్వాలని ముఖ్యమంత్రి అబిలషించారు. ప్రకృతిని పరిరక్షించడమే తన లక్ష్యమన్నారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. రూ.20 కోట్లతో తమ్మడికుంట చెరువు పూడికతీత, చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, పిల్లల క్రీడా స్థలం తీర్చిదిద్దారు. చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. చెరువు అభివృద్ధిలో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెలను కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అభినందనలు తెలిపారు అక్కినేని నాగార్జున . ఇతర దేశాల చెరువుల మాదిరిగా..తమ్మిడికుంట చెరువును అభివృద్ధిని హైడ్రా అభివృద్ది నిరూపించిందని ప్రశంసించారు. ఇందులో ముఖ్యమంత్రి సంకల్పం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రంగనాథ్‌ను కలిసినప్పుడు తన ఆలోచన వేరేగా ఉండేదని.. తన ఆలోచనా విధానాన్ని మార్చి తమ్మిడికుంటను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు సీఎం వెల్లడించారు. తమ్మిడికుంట వద్ద డ్యాన్స్ చేయలేను కానీ షూటింగ్ చేస్తా అని చెప్పుకొచ్చారు నాగార్జున.
