Actor Naresh: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయి? కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి.. అట్టహాసంగా చేసుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత ఏమవుతోంది? దీనిపైనే టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేశ్ కొన్ని మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ విషయమే హాట్ టాపిక్! అసలు నరేశ్ ఏమన్నారంటే.. పెళ్లిళ్లు ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఈవెంట్లుగా మారిపోయాయట. పెళ్లి చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు.. కట్ చేస్తే, మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకోవడానికి కూడా అంతే రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజమే కదండీ! నేటి తరం ఆలోచనలు చాలా మారిపోయాయి. అందుకే నరేశ్ గారు ఒక ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అది ఎవరి ఇష్టం వాళ్లది. అంతేకాదు, నచ్చితే లివింగ్ టుగెదర్ రిలేషన్‌షిప్‌లో ఉండటం కూడా తప్పేమీ కాదంటూ తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు.
కానీ, ఇక్కడే ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు కానీ.. పిల్లల్ని మాత్రం కనడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎందుకంటే, రేపటి తరానికి మన వంశాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పిల్లలు అవసరం కదా! అలాగే, ఆయన సమాజంలోని మరో చేదు నిజాన్ని కూడా బయటపెట్టారు. సిటీల్లో పెళ్లిళ్ల ట్రెండ్ ఇలా ఉంటే.. పల్లెటూళ్లలో మాత్రం చాలామంది యువకులకు అసలు పెళ్లి సంబంధాలే దొరకడం లేదని, అక్కడి పరిస్థితి నిజంగా ఆందోళనకరంగా ఉందంటూ ఆవేదన పడ్డారు.
ఈ కామెంట్స్ ఎక్కడ చేశారో తెలుసా? అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్‌లో వస్తున్న కొత్త సినిమా ‘క్రేజీ కళ్యాణం’ భద్రప్ప గాజుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ పూర్తిగా పెళ్లి చుట్టూ తిరిగే ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నరేశ్ పెళ్లి టాపిక్ రాగానే ఇలా ఓపెన్‌గా మాట్లాడేశారు. ఈ క్రేజీ కళ్యాణం సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ, నరేశ్ గారు చేసిన ఈ కామెంట్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
