విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు హీరోయిన్ రష్మిక మందన్న హాజరుకాకపోవడం తీవ్ర చర్చకు, వివాదానికి దారితీసింది. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ వేడుకపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక రాకపోవడంతో నిరాశ చెందిన అభిమానులకు, మీడియాకు విజయ్ దేవరకొండ స్వయంగా క్షమాపణలు చెప్పారు.

VIJAY DEVARAKONDA
విజయ్ దేవరకొండ ఈ వివాదంపై స్పందిస్తూ అసలు కారణాన్ని ఈ విధంగా వివరించార రష్మిక ప్రస్తుతం ముంబైలో తన హిందీ ప్రాజెక్ట్ రాకా’ షూటింగ్ లో చాలా బిజీగా ఉండటం వల్లే రాలేకపోయిందని విజయ్ స్పష్టం చేశారు. ఆమె కూడా ఈ ఈవెంట్‌కు రావాల్సింది, కానీ షూటింగ్ వల్ల రాలేకపోయింది. రష్మిక తరపున మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా అని విజయ్ వేదికపై పేర్కొన్నారు
లైఫ్ అంతా ఈజీగా ఉండదు డార్లింగ్ అంటూ విజయ్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ట్రైలర్ లాంచ్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే డేట్స్ విషయంలో ముందే సరైన స్పష్టత లేకపోవడం వల్ల పనులు ఆలస్యం కావడం వల్ల రష్మిక తన షూటింగ్ డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకోలేకపోయిందని ఆయన తెలిపారు.
