ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. కుర్రాళ్ల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ నడుము తిప్పేస్తున్నారంతే! అస్సలు ఈ సాంగ్ వైరల్ అవ్వడం ఏంటి ఒక రేంజ్ ఉప్పెనలా ముంచేసింది! కానీ.. రీసెంట్ గా ఈ జిలేబీ సాంగ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఎక్కడో తెలుసా? మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ మూవీ క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంచ్ అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? హీరో వస్తాడు, హీరోయిన్ నవ్వుతుంది, ప్రొడ్యూసర్ థాంక్స్ చెప్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది స్టేజ్ మీది మన నరేష్ ఊరుకుంటారా? తనలో ఉన్న 16 ఏళ్ల కుర్రాడిని బయటకి తీశారు! ఆ జిలేబీ ట్యూన్‌కి ఆయన వేసిన మాస్ స్టెప్పులు చూసి పక్కనే ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ కూడా నరేష్ ఎనర్జీ చూసి షాక్ అయిపోయి.. వాళ్లు కూడా స్టెప్పులు వేయక తప్పలేదు!
నిజంగా.. ‘క్రేజీ కళ్యాణం’ అనే టైటిల్‌కి తగ్గట్టే, ట్రైలర్ లాంచ్ లో నరేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు చాలామంది ఎంతోమంది హీరోల డ్యాన్సులు చూసుంటారు, కానీ ఒక సీనియర్ యాక్టర్ ఇలా కరెంట్ వైర్‌లా మారి స్టేజ్‌పై వైబ్రేషన్స్ తెచ్చిన కంటెంట్ మాత్రం మీరు ఎక్కడా చూసుండరు!
#CrazyKalyanam మూవీ టీమ్ సందడి!
#JimJimTaara పాటకు స్టెప్పులేస్తూ అలరించిన #CrazyKalyanam మూవీ టీమ్! #AnupamaParameswaran #Naresh #AkhilRaj #sumantv https://t.co/wRka3qSQMd— SumanTV (@SumanTV) October 13, 2026
