దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజుల పవిత్ర కాలంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మను కొలుస్తూ ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. అయితే ఇంట్లో గర్భిణులు ఉన్నప్పుడు.. “మేము కూడా ఈ ఉపవాసాలు ఉండొచ్చా? కడుపులోని బేబీపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?” అనే సందేహాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పలు కీలకమైన సూచనలు చేస్తున్నారు.
చాలామందికి ఒక పూట భోజనం మానేస్తే బిడ్డకు ఏదో అయిపోతుందనే ఆందోళన ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో ఒక పూట ఫుడ్ స్కిప్ చేసినంత మాత్రాన కడుపులోని బేబీకి న్యూట్రియంట్స్ అందకుండా పోతాయని భయపడాల్సిన పనిలేదు. మన హ్యూమన్ బాడీలో శక్తిని నిల్వ ఉంచుకునే సహజమైన సిస్టమ్ ఉంటుంది. స్వల్పకాలికంగా ఆహారం తీసుకోకపోతే శరీరం ఆ స్టోర్డ్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. కానీ సమస్య ఇక్కడితో ఆగిపోదు. పదేపదే ఆహారం తక్కువగా తీసుకోవడం, కేవలం పిండి పదార్థాలు మాత్రమే తింటూ ఉపవాసం చేయడం, ముఖ్యంగా ఎక్కువ గంటల పాటు నీళ్లు కూడా తాగకుండా ఉండటం గర్భిణులకు చాలా డేంజరస్ గా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో బాడీకి సాధారణం కంటే ఎక్కువే ఎనర్జీ అవసరం కాబట్టి, లాంగ్ ఫాస్టింగ్స్ తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయి.

నవరాత్రి ఉపవాసాల్లో చాలామంది బంగాళాదుంపలు, సగ్గుబియ్యం వంటి వాటినే ఎక్కువగా తీసుకుంటారు. వీటి ద్వారా కార్బోహైడ్రేట్లు మాత్రమే అందుతాయి కానీ, ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి అత్యవసర పోషకాలు తగినంతగా లభించవు. దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏర్పడే రిస్క్ ఉంది. ఇది దీర్ఘకాలంలో బేబీ గ్రోత్ పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాకుండా కఠిన ఉపవాసాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయి డిజీనెస్ , నీరసం, తలనొప్పి వస్తాయి. కొన్నిసార్లు నీళ్లు కూడా ముట్టకపోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ చాలా ఎక్కువ. ముఖ్యంగా జెస్టేషనల్ డయాబెటిస్ , అనీమియా లేదా హై బిపి సమస్యలు ఉన్నవారైతే పొరపాటున కూడా ఉపవాసాలు చేయకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలని డిసైడ్ అయితే, ముందుగా రెగ్యులర్‌గా మీకు చెకప్ చేసే గైనకాలజిస్ట్ లేదా ఆబ్స్టెట్రీషియన్ ను కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. మీ హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ చెప్పే సలహాలు ఫాలో అవ్వడం చాలా సేఫ్. కంప్లీట్ ఫాస్టింగ్ బదులుగా హెల్తీ ఆల్టర్నేటివ్స్ ట్రై చేయడం మంచిది. రోజంతా కొద్దికొద్దిగా పాలు, పెరుగు, పనీర్, ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్ వంటివి తీసుకోవచ్చు. ఎక్కువసేపు స్టమక్ ఖాళీగా ఉంచకుండా, ఆయిలీ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. బాడీకి సరిపడా వాటర్, జ్యూసులు అందేలా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్.
ఉపవాస సమయంలో ఒకవేళ విపరీతమైన నీరసం, కళ్లు తిరగడం, వాంతులు కావడం లేదా యూరిన్ తగ్గుముఖం పట్టడం వంటి వార్నింగ్ సైన్స్కనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్‌గా ఉపవాసం ఆపేసి డాక్టర్‌ను కలవాలి. దైవభక్తిని చాటుకోవడానికి రోజుల తరబడి పస్తులు ఉండాల్సిన అవసరం లేదని, తల్లీబిడ్డల క్షేమమే దేవుడు కోరుకునే అసలైన ప్రసాదమని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
