ఇండియన్ ఉమెన్స్ క్రికెట్‌లో ఒక శకం ముగిసింది! కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్‌ను తన భుజాలపై మోసిన కెప్టెన్, లేడీ ధోనీగా పేరు తెచ్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నపళంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంది! ‘అమ్మాయిల క్రికెట్ ఎవరు చూస్తారులే’ అనే చిన్నచూపు నుంచి.. ‘టీమిండియా ఉమెన్స్ మ్యాచ్ ఎప్పుడుంది?’ అని ఫ్యాన్స్ ఆరా తీసే స్థాయికి టీమ్‌ను తీసుకొచ్చిన గ్రేట్ లీడర్ హర్మన్! కానీ, ఆమె ఇలా సడెన్‌గా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం వెనుక అసలు రహస్యమేంటి? ఈ నిర్ణయం వెనుక బిసిసిఐ ప్రమేయం ఉందా?”
నిజానికి ఈ నిర్ణయం వెనుక సోమవారం గౌహతిలో జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ కీలకంగా మారింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ కూడా హాజరయ్యారు.ఇటీవల టీమిండియా ఆసియా గేమ్‌లలో స్వర్ణం సాధించడం సహా కొన్ని మంచి విజయాలు సాధించిన నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని అంతా భావించారు. కానీ, సమావేశంలో హర్మన్ కెప్టెన్సీతో పాటు, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ కొనసాగింపుపై తీవ్రమైన చర్చలు జరిగాయి.రాబోయే ముఖ్యమైన టోర్నీలను దృష్టిలో ఉంచుకుని, కెప్టెన్సీ మార్పు అవసరమని బోర్డు పెద్దలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.”
బోర్డు సంకేతాల తర్వాత.. మీటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.హర్మన్‌ప్రీత్ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు.. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ రూపురేఖలను మార్చిన గేమ్ ఛేంజర్! ఆస్ట్రేలియాపై 171 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ నుండి, జట్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడం వరకు హర్మన్ ప్రయాణం అద్భుతం. మెన్స్ క్రికెట్‌లో ఎంఎస్ ధోనికి ఎంత ఫాలోయింగ్ ఉందో, ఉమెన్స్ క్రికెట్‌లో హర్మన్ అంతటి మైలురాయిగా నll నిలలిచింది..
