బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఉమెన్స్ జట్టు మ్యాచ్ ని టై చేసుకుంది. ఈ మ్యాచు అనంతరం హర్మన్ అంపైర్ పై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉమెన్స్ క్రికెట్ లో భాగంగా ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడుతుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా చెరో రెండు మ్యాచులు ఆడగా.. నిర్ణయాత్మకమైన చివరి వన్డే నేడు జరిగింది. ఈ మ్యాచ్ టై గా ముగిసింది. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లను 225 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్ ఫర్గాన హక్(107) సెంచరీతో కదం తొక్కింది. మరో ఓపెనర్ సుల్తానా కూడా 52 పరుగులు చేసి జట్టు ఓ మాదిరి స్కోర్ చేయడంలో సహకరించింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళల జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 225 పరుగుల వద్దే ఆలౌటైంది. ఓపెనర్ శృతి మందాన(59) హర్లీన్ డియోల్ (77) అర్ధ సెంచ రీలు చేసిన మిగిలిన వారు విఫలమవడంతో గెలవలేకపోయింది. ఇక మ్యాచ్ గురించి పక్కన పెడితే ఈ మ్యాచులో భారత కెప్టెన్ అసహనం ప్రదర్శించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది.
భారత లక్ష్యం 226 పరుగులు. అప్పటికీ 33 ఓవర్లలో వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి టీమిండియా విజయం వైపుగా దూసుకెళ్తుంది. క్రీజ్ లో అప్పటికే కుదురుకున్న హర్లీన్ డియోల్ తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. అయితే ఈ దశలో నహిదా అక్తర్ వేసిన అద్భుతమైన బౌల్ కి హర్మన్ స్వీప్ షాట్ కి ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూ గా వెనుదీయరాగాల్సి వచ్చింది. అయితే బంతి క్లియర్ గా బ్యాట్ కి తగిలిందని భావించిన హర్మన్ అంపైర్ పై తన అసహనాన్ని ప్రదర్శించింది. తీవ్ర కోపంతో బ్యాట్ ని వికెట్లకి వేసి గట్టిగా కొట్టింది. హర్మన్ తీరు అందరినీ ఆశ్చర్యపరిచిన ఇందులో అంపైర్ తప్పిదం కూడా ఉందని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చింది. ” ఈ మ్యాచులో అంపైర్ తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఈసారి బంగ్లాదేశ్ కి వచ్చేటప్పుడు మేము అంపైర్ తో ముందుగానే ఒక డీల్ మాట్లాడుకొని వస్తామని చెప్పింది. మరి హర్మన్ ఔట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Frustrated Harmanpreet Kaur hits the stumps with her bat, few angry words to the umpire before walking off. #CricketTwitter #BANvIND pic.twitter.com/uOoBgS9g44
— Female Cricket (@imfemalecricket) July 22, 2023