థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవాలన్నా, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బెండు తీయాలన్నా ఆ కాంబినేషన్ దిగాల్సిందే! ఎస్, యు గెస్డ్ ఇట్ అఖండ 3 ఊచకోత: బాలయ్య-బోయపాటి కాంబోలో బాక్సాఫీస్ తాండవం! రైట్… గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను! వీళ్లద్దరూ కలిస్తే సినిమా థియేటర్ కాదు… జాతర! ఆల్రెడీ ‘అఖండ 2 తో బాక్సాఫీస్ దగ్గర శివతాండవం ఆడించిన ఈ కాంబో ఇప్పుడు అంతకుమించి అనేలా అఖండ 3 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది! సోషల్ మీడియా షేక్ అయిపోతోంది ఫ్యాన్స్ లో అంచనాలు హిమాలయాలను దాటేస్తున్నాయి! మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? అసలు బోయపాటి మైండ్‌లో ఉన్న ఆ ఇద్దరు మెగా-నందమూరి పిల్లర్లు ఎవరు?
ఇప్పుడే కదా అసలైన ట్విస్ట్! రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను… మీడియా ముందు ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అఖండ 3 ఖచ్చితంగా ఉంటుందని చెప్తూనే… ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మాట చెప్పారు! ఏంటో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణలతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఓపెన్ అయిపోయారు! బాబోయ్… ఒకవేళ ఇదే నిజమైతే, తెలుగు సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుంది! ఇక అఖండ 3 అప్‌డేట్ విషయానికొస్తే… ఈ నెలాఖరులోనే బోయపాటి తన కొత్త ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. సరైన టైమ్ చూసి బాలయ్య బాబుతో కలిసి అఖండ 3 వివరాలు కూడా బయటపెడతారట. అంటే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం

అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఒక్కటే… బోయపాటి శ్రీను ఏ సినిమా తీసినా, ఏ కొత్త ప్రాజెక్ట్ అనుకున్నా.. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, ఎందుకు? బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎంత పీక్స్‌లో ఉంటుందో, దైవత్వం, సనాతన ధర్మం కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆయన నమ్మేది ఒక్కటే… మన సంకల్పం ఎంత బలంగా ఉన్నా, ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు ఉంటేనే ఏ కార్యమైనా విజయవంతం అవుతుంది! అందుకే తన ప్రతి సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక, ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ముందు ఆనవాయితీగా తిరుమల శ్రీవారి పాదాల చెంత పూజలు చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఆ స్వామి వారి పవర్, బోయపాటి పెన్ పవర్ కలిసే థియేటర్లలో ఆ రేంజ్ వైబ్రేషన్స్ వస్తాయి!
“సో మేటర్ అయితే క్రిస్టల్ క్లియర్! బోయపాటి మార్క్ హై-వోల్టేజ్ డ్రామా, బాలయ్య బాబు రౌద్ర రూపం… ‘అఖండ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. దీనికి తోడు చిరు-బాలయ్య మల్టీస్టారర్ లైనప్ గనుక సెట్ అయితే… బాక్సాఫీస్ దగ్గర లెక్కలు సరిపోవు, రికార్డులు మిగలవు! మరి బాలయ్య-చిరు కాంబోలో బోయపాటి సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాం….
