Prabhas : మన డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే అంటే టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్టోబర్ 23న వస్తున్న డార్లింగ్ పుట్టినరోజు కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మైలురాయి లాంటి హిస్టారికల్ వార్ డ్రామా ఫౌజీ నుంచి సాలిడ్ టీజర్ రాబోతోందని, ఆ రోజు సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయమని అంతా ఊహించారు. కానీ.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిర్మాత నవీన్ యెర్నేని ఒక ఊహించని షాక్ ఇచ్చారు. అక్టోబర్ 23న ఫౌజీ టీజర్ రిలీజ్ చేయడం లేదని చెప్పేసారు! ఈ బ్యాడ్ న్యూస్ వినగానే ఫ్యాన్స్ గుండె కాస్త పగిలినంత పనైంది. మేకర్స్ ఎందుకు టీజర్ రిలీజ్ చేయడం లేదనే కదా మీ డౌట్? దానికి బలమైన కారణాలే ఉన్నాయి.
నిజానికి ఫౌజీ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్క్ చేస్తోంది. చిత్రబృందం ప్రస్తుతం ఒక భారీ ఇంటర్వెల్ మరియు యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో బిజీగా ఉంది. టీజర్ కట్ చేయాలంటే అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వరల్డ్ క్లాస్ సౌండ్ డిజైన్ అవసరం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని, అరకొర విజువల్స్‌తో టీజర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ టీజర్‌ను హోల్డ్‌లో పెట్టారట.
అయితే డార్లింగ్ ఫ్యాన్స్ అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిర్మాత నవీన్ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. బర్త్‌డే రోజు టీజర్ రాకపోయినా.. అంతకు మించిన ఒక అత్యంత ఆసక్తికరమైన స్పెషల్ కంటెంట్‌ను రిలీజ్ చేయబోతున్నారట. ఈ కంటెంట్ వరల్డ్ ఆఫ్ ఫౌజీ ని పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని గట్టి భరోసా ఇచ్చారు. ఇది సినిమా టేబుల్స్‌ను తిరగేసేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్!
డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియా వేదికగా ఇప్పటికీ మేకర్స్‌ను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. పోస్టర్లతో సరిపెట్టకండి, మాకు చిన్నదైనా సరే టీజర్ కావాల్సిందే” అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ లేపుతున్నారు. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్, ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ లుక్ చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు మేకర్స్ ఏమైనా చివరి నిమిషంలో మనసు మార్చుకుంటారా? లేదా నవీన్ ప్రామిస్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించబోతోంది? అనేది తెలియాలంటే మనం అక్టోబర్ 23 వరకు ఆగాల్సిందే.
