తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. ఎన్నో సినిమాలలో అద్బుతమైన పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. ఎన్నో సినిమాలలో అద్బుతమైన పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అందులో అమ్మో ఒకటో తారీఖు, దేవుళ్లు, గోకులంలో సీత, మంచి మొగుడు, ప్రేయసి రావే, శుభాకాంక్షలు, సుప్రభాతం వంటి చిత్రాలతో మంచి పాపులారిటి సంపాదించుకుంది. ఇలా హీరోయిన్ గా ఇండ్రస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రాశి ఒకానొక సమయంలో కెరియర్ పరంగా కొన్ని రాంగ్ స్టెప్ప్ వేసిందని చెప్పొచ్చు. హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం వల్ల హీరోయిన్‌గా అవకాశాలు దూరమయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరోలలో చిరజీవి, శోభన్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇప్పుడున్న యంగ్ హీరోలలో ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. రాశి మాట్లాడుతూ.. “ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం, అయనతో నటించాలని కోరిక అది కూడా హీరోయిన్‌గా అయితే నటిస్తా. తల్లి లాంటి పాత్రలు మాత్రం చెయ్యను. ఇప్పటి వరకు నేను ప్రభాస్‌తో ఎప్పుడు మాట్లాడలేదు. అయితే అడవి రాముడు షూటింగ్ సమయంలో ఒకే హోటల్లో ఉన్నాం. ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా ప్రభాస్ ను కలవాలి అనుకున్నా.. కానీ కుదరలేదు. ప్రభాస్ ఉన్న రూమ్ కి కాల్ చేసి మాట్లాడాను. అయనతో మాట్లాడడం నాకు చాలా సంతోంగా అనిపించింది. అలాగే తను అందరికి మంచి గౌరంవి ఇచ్చి మాట్లాడతారు”అంటూ.. చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు సినిమా హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన బ్యూటీలంతా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. కొందరు సినిమాలలో తల్లి, అత్త పాత్రలు చేస్తుంటే.. ఇంకొందరు సైలెంట్ గా సీరియల్స్ చేసుకుంటున్నారు. అలా ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగి.. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తోంది తెలుగు బ్యూటీ రాశి. సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసిన రాశి.. పెళ్లి తర్వాత నటనకు దూరమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అత్త, తల్లి క్యారెక్టర్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రెజెంట్ సీరియల్స్ కూడా చేస్తోంది.