గ్లోబల్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒకేసారి డబుల్ ధమాకా లాంటి గుడ్ న్యూస్ అందింది! రజనీకాంత్ నుంచి సినిమా అప్‌డేట్ వస్తేనే థియేటర్ల దగ్గర పూనకాలు వస్తాయి, అలాంటిది ఆయన రియల్ లైఫ్ గురించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మన తలైవా తన జీవిత ప్రయాణాన్ని మొత్తం ఒక పుస్తక రూపంలో పెట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే! రజనీకాంత్ ఆత్మకథ చాలా త్వరలోనే మన ముందుకు రాబోతోంది. రజనీకాంత్ పాత సినిమాలు, కండక్టర్ రోజులు, ఇప్పటి వరకు ఆయన అందుకున్న అవార్డుల ఇవన్నీ ఒకే బుక్ లో చూపించబోతున్నారు. ఏడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు తాజాగా రజనీకాంత్‌తో జరిగిన భేటీ వివరాలను ఈ విదంగా వెల్లడించారు
ఒక సాదాసీదా బస్ కండక్టర్ స్థాయి నుంచి.. కోట్లాది మంది గుండెల్లో దేవుడిగా కొలువయ్యే ‘సూపర్ స్టార్‘ వరకు రజనీ ప్రయాణం ఒక అద్భుతం. ఆయన స్టైల్, ఆయన మేనరిజమ్స్, ఆయన నటన.. ఇవన్నీ ఒక ఎత్తయితే, తెర వెనుక ఆయన వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక చింతన, లైఫ్ ఫిలాసఫీ ఇంకో ఎత్తు. అసలు ఒక మనిషి ఇంతలా ఎలా ఎదగగలిగారు? ఆయన లైఫ్‌లో చూసిన ఒడిదుడుకులు ఏంటి? సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను రజనీకాంత్ స్వయంగా ఈ పుస్తకంలో పంచుకోబోతున్నారట. ప్రస్తుతం ఆయన ఈ బయోగ్రఫీకి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే ఇక్కడే అభిమానులకు అసలైన డబుల్ ట్రీట్ దొరికింది! ఈ పుస్తకం కేవలం తమిళం వాళ్లకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానుల కోసం దీనిని తమిళంతో పాటు ఒకేసారి ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంటే లాంగ్వేజ్ బారియర్స్ లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తలైవా ఫ్యాన్స్ అందరూ ఈ పుస్తకాన్ని చదివి ఆనందించవచ్చన్నమాట.
నిజంగా ఒక రోల్ మోడల్ జీవితాన్ని ఆయన మాటల్లోనే చదవడం అంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి? రజనీకాంత్ స్టైల్‌లోనే ఈ పుస్తకం కూడా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి తలైవా బయోగ్రఫీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ సెక్షన్‌లో మాతో పంచుకోండి.
