పబ్లిక్ థియేటర్లలో ఈలలు వేస్తే, కొందరు సోషల్ మీడియాలో ఏడుస్తుంటారు.. మన టాలీవుడ్‌లో ఇది ఎప్పుడూ ఉండేదే! కానీ ఈ మధ్య మన రౌడీ హీరో, ‘రణబాలి’ లో సింగనమల బొబ్బిలిగా వస్తున్న విజయ్ దేవరకొండ నోరు విప్పితే చాలు, అవతలి వాళ్లకి చెమటలు పట్టాల్సిందే, అసలు నిజాలు బయటపడాల్సిందే! మొన్న ‘రణబాలి’ ట్రైలర్ ఈవెంట్‌లో మనోడు ఇచ్చిన కౌంటర్లకి, సోషల్ మీడియా ట్రోలర్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయ్!
ఈ ఆన్‌లైన్ నెగిటివిటీ వెనకాల పైసలు తీసుకునే పెయిడ్ ముఠాలు ఉన్నాయని ఏకంగా గుమ్మడికాయే బద్దలు కొట్టాడు మన హీరో విజయ్ దేవరకొండ! యాభై మంది కూర్చుని, ఫేక్ అకౌంట్లతో ఒకే డైలాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కనిపిస్తున్నాయంటే, ఎవరో పైసలు పెట్టి చేయిస్తున్నాడని చిన్న పిల్లోడికైనా అర్థం కాదా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడు! ‘రణబాలి వద్దు.. పక్క సినిమాకి పోదాం’ అని అందరూ ఒకే రాత రాస్తున్నారంటే.. అది పబ్లిక్ ఇచ్చిన రివ్యూ కాదు జేబులోంచి వచ్చిన ప్యాకేజీ రివ్యూ
ఈ పెయిడ్ ట్రోలింగ్ దందాపై నేచురల్ స్టార్ నాని, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్ కూడా ఫుల్ ఫైర్ అయ్యారు! సినిమా కిర్రాక్ ఉంటే ఆడియన్స్ థియేటర్ చింపేస్తారు, నచ్చకపోతే తుస్సుమన్నారు అని జోకేసి వదిలేస్తారు.. అంతే కానీ, ఇలా నోట్ల కట్టలు విసిరి పెయిడ్ గాళ్లను పెట్టి కెరీర్లను తొక్కేయాలని చూడటం అని టోటల్ ఫిలిం నగర్ అంతా ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తోంది!”
అర్జున్ రెడ్డి’ టైంలో మనోడు చూపించిన స్వాగ్‌ని అహంకారం అనుకుని చాలామంది షోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు. ఇదంతా జనాలు చేస్తున్నది కాదు, కావాలని డిజైన్ చేయిస్తున్న హేట్రెడ్ అని తెలిసాకే నా మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోయింది’ అని చెప్పాడు మనల్ని తొక్కేయడానికి ఎవడు గోతులు తవ్వుతున్నాడో క్లారిటీ వచ్చాక ఇంక భయమెందుకు అందుకే సినిమా విడుదలతోనే థియేటర్లలో సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యాడు
