సినిమా అంటే కేవలం రెండున్నర గంటల వినోదం మాత్రమే కాదు.. కానీ అదే సినిమా ‘జక్కన్న’ చేతుల్లో పడితే, అదొక వెండితెర అద్భుతం.. ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్! ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక హాట్ టాపిక్..ఏంటో తెలుసా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళిల డ్రీమ్ కాంబోలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’!
సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు స్కై హై లో ఉన్నాయి.. ఇక తాజాగా వచ్చిన ఒక క్రేజీ అప్‌డేట్ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది! విషయం ఏంటంటే.. బాహుబలి సినిమాలో ‘కిలికి’ భాష ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే కదా. దానికి లాంటి ఒక సూపర్ కాన్సెప్ట్ భాషను రాజమౌళి వారణాసి మూవీ కోసం తయారు చేశారట! ఈ న్యూస్ విన్నాక ఫ్యాన్స్ లో జోష్ అంతకంతకూ పెరిగిపోతోంది..!
అవును మీరు విన్నది నిజమే! కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. బాహుబలిలో ‘కిలికి’ భాషని కేవలం విలన్స్ కోసమే వాడారు కదా.. కానీ వారణాసిలో రాబోయే కొత్త భాష అలా కాదంట! ఇది జస్ట్ కొన్ని డైలాగ్స్ చెప్పి వదిలేసేది కాదు.. అసలు సినిమా స్టోరీ మొత్తం ఆ లాంగ్వేజ్ చుట్టూనే తిరుగుతుందట! అదొక సస్పెన్స్ ఎలిమెంట్ అన్నమాట. అసలు ఆ భాష వెనుక ఉన్న ప్రపంచం ఏంటి? ఆ స్క్రిప్ట్ ఏ కాలం నాటిది? అది మన సూపర్ స్టార్ మహేష్ బాబు క్యారెక్టర్ *’రుద్ర’*కి ఎలా కనెక్ట్ అయింది? అనేది ప్రస్తుతానికి ఫుల్ సీక్రెట్! జనాలు ఏమనుకుంటున్నారంటే.. ఇదొక టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ సినిమా కదా, మహేష్ బాబు వేర్వేరు కాలాల్లోకి, వేర్వేరు దేశాల్లోకి వెళ్లేటప్పుడు ఒక పురాతన మిస్టరీని డీకోడ్ చేయాల్సి వస్తుందట. దాన్ని ఛేదించాలంటే ఈ కొత్త భాషను కనిపెట్టాలి, నేర్చుకోవాలి! వినడానికే పక్కా హాలీవుడ్ రేంజ్ వైబ్స్ వస్తున్నాయి కదూ..!

జక్కన్న బ్రాండ్ అంటే ఇదే మరి! ఈ జనరేషన్‌లో చిన్న సినిమాలకే ఏఐ డబ్బింగ్ వాడి పనైపోగొడుతుంటే.. రాజమౌళి మాత్రం వారణాసి మూవీని ఏకంగా 120 పైగా దేశాల్లో, 50 భాషల్లో రిలీజ్ చేస్తూ.. ఎక్కడా ఏఐ టెక్నాలజీ వాడకుండా ఒరిజినల్ వాయిస్ ఆర్టిస్టులనే పెడుతున్నారట! ఏ భాషలో చూసినా సరే, ఆడియన్స్‌కి ఆ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్‌లో కనెక్ట్ అవ్వాలని మనోడు చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు. అందుకే మరి ఆయన్ని దర్శకధీరుడు అనేది.
మూవీ థియేటర్లలోకి రావడానికి 2027 ఏప్రిల్ వరకు టైమ్ ఉన్నా.. రోజుకో క్రేజీ లీక్‌తో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. మన తెలుగు సినిమా పవర్‌ని వరల్డ్ లెవెల్లో చూపించడానికి రాజమౌళి, మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారు. మరి ఆ కొత్త కాన్సెప్ట్ భాష ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది? మన సూపర్ స్టార్ బాక్సాఫీస్‌ని ఎలా వేటాడబోతున్నాడు? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
