SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Punjab Carpenter Wins 1 5 Crore Lottery 200 Rupees Ticket

రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Fri - 13 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆడపిల్ల పుట్టిన 24 గంటల్లోనే కోటీశ్వరుడైన తండ్రి..

మన దేశంలో ఆడపిల్ల పుట్టిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిందని చాలామంది సంబరాలు చేసుకుంటారు. కానీ, ఇప్పటికీ కొంతమంది మగబిడ్డే కావాలని పట్టుబడుతూ, ఆడపిల్ల పుడితే భారంగా భావించి చీదరించుకునే పరిస్థితులు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచన ఉన్న కుటుంబంలో జరిగిన ఒక రియల్ లైఫ్ మిరాకిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆడపిల్ల పుట్టిందని ముఖం తిప్పుకున్న బంధువుల ముందే, ఆ పసిబిడ్డ తండ్రి కేవలం 24 గంటల్లోనే కోటీశ్వరుడైపోయాడు. ఇంతకీ ఈ ఆసక్తికర ఘటన ఎక్కడ జరిగింది? రూ. 200 ఖర్చు పెట్టిన ఆ తండ్రికి ఏకంగా కోటీ 50 లక్షలు ఎలా వచ్చాయి?

ఈ ఆసక్తికరమైన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మన్సా జిల్లా, బరేటా టౌన్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ నివసించే 24 ఏళ్ల యుధ్ వీర్ సింగ్ వృత్తిరీత్యా ఒక సాధారణ కార్పెంటర్. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే, ఇటీవల ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ కుటుంబం మగబిడ్డ కావాలని కోరుకోవడంతో, ఆస్పత్రిలో తల్లీబిడ్డను చూడటానికి వచ్చిన బంధువులు ఆడపిల్ల పుట్టిందని చీదరించుకున్నారు. అయితే, ఆ చిన్నారి తమ ఇంటికి ఎంతటి అదృష్టాన్ని తీసుకొచ్చిందో ఆ క్షణంలో ఎవరూ ఊహించలేకపోయారు.

అసలు ఈ అదృష్టం ఎలా తలుపు తట్టిందనే విషయాన్ని యుధ్ వీర్ సింగ్ స్వయంగా వివరించారు. నవంబర్ 4వ తేదీన తన భార్యను కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో, మొబైల్ సిమ్ కార్డును పోర్ట్ చేయించుకోవడానికి ఒక షాపు వద్ద ఆగాడు. అక్కడే ‘పంజాబ్ స్టేట్ డియర్ 200 మంత్లీ లాటరీ’ షాపు కనిపించడంతో, లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని రూ. 200 పెట్టి ఒక టికెట్ కొనుగోలు చేశాడు. నిజానికి అప్పుడు ఆయన భార్య కూడా వారించింది.. “మనం ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం, మెడికల్ టెస్టులకు కూడా డబ్బులు లేవు, ఇప్పుడు ఈ లాటరీలు ఎందుకు?” అని చెప్పింది. అయినప్పటికీ, ఏదో తెలియని నమ్మకంతో యుధ్ వీర్ ఆ టికెట్ తీసుకున్నాడు.

Join Our Whatsapp Channel

విధి రాత ఎలా ఉంటుందో చూడండి.. సరిగ్గా నవంబర్ 6, 7 తేదీల మధ్య తన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిన రోజే లాటరీని తీశారు. ఆ ఫలితాలను చూసిన యుధ్ వీర్ సింగ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను మొదటిసారి కొన్న రూ. 200 టికెట్‌కు ఏకంగా కోటీ 50 లక్షల రూపాయల బంపర్ ప్రైజ్ తగిలింది. ఆడబిడ్డ పుట్టిన 24 గంటల్లోనే ఆ సాధారణ కార్పెంటర్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. నిన్నటి వరకు ఆడపిల్ల అని చీదరించుకున్న బంధువులందరూ ఇప్పుడు నోరెళ్లబెట్టారు. తమ ఇంట్లో నిజంగానే లక్ష్మీదేవి అడుగుపెట్టిందని ఆ కుటుంబం ఇప్పుడు ఘనంగా సంబరాలు చేసుకుంటోంది.

తనకు వచ్చిన ఈ కోటీ 50 లక్షల రూపాయలను ఎంతో బాధ్యతగా ఖర్చు చేస్తానని యుధ్ వీర్ సింగ్ స్పష్టం చేశాడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమ కుటుంబం కోసం ఒక మంచి ఇల్లు నిర్మించుకోవడంతో పాటు, తనకు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టిన తన చిన్నారి చదువు, భవిష్యత్తు కోసమే ఈ డబ్బును ఉపయోగిస్తానని ఆనందంగా తెలిపాడు. చూశారు కదా.. ఆడపిల్లలు ఎప్పటికీ భారం కాదు, వారు ఇంటికి దీపం లాంటివారని ఈ ఘటన మరోసారి నిరూపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags :

  • 1.5 Crore Lottery
  • 200 Rupees Ticket
  • Baby Girl Luck
  • Lottery Winner
  • Punjab Lottery
  • Punjab News
  • telugu news
  • Trending News
  • viral news
  • Yudhvir Singh
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు.. భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • నేడు బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం..

    బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన! రైతులకు IMD కీలక హెచ్చరిక

  • AI కన్నా మనుషులే మిన్న.. దిగ్గజ కంపెనీల యూ-టర్న్..

    ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోయాయనుకుంటే.. ఇప్పుడు మళ్లీ పాత ఉద్యోగులకు పిలుపు! గూగుల్, అమెజాన్‌లో ఏం జరుగుతోంది?

  • అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

    అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

    చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

  • చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం!

  • మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. భావోద్వేగ వీడియో విడుదల చేసిన సజ్జనార్.. మహేశ్ భగవత్‌కు ఏమన్నారు?

  • రూ.4 కోట్ల అప్పులు.. బంగారం కోసం మహిళను హత్య! మీర్‌పేట్ కేసులో షాకింగ్ నిజాలు

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam