లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి డీఎన్‌కే మూవీ రివ్యూ
వన్ మ్యాన్ షోగా మౌళి తనూజ్.. గెటప్స్ అదుర్స్
అందంతో ఆకట్టుకున్న సుస్మిత పాత్రకు స్కోప్ తక్కువే
వర్కౌట్ కాని ట్విస్టులు.. పేలవమైన కథనమే మైనస్
మైత్రీ రిచ్ ప్రొడక్షన్.. కథపై దృష్టి పెట్టాల్సింది
ఈ వారం థియేటర్లలోకి ఒక వెరైటీ టైటిల్‌తో, క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డీఎన్‌కే’.. అదేనండీ ‘దొంగ నా కొడుకు’. లిటిల్ హార్ట్స్ సినిమాతో యూత్‌లో మంచి ఫేమ్ తెచ్చుకున్న మౌళి తనూజ్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన ఈ క్రైమ్ కామెడీ ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి టైటిల్లో ఉన్నంత కిక్కు సినిమాలో ఉందా? ‘దొంగ నా కొడుకు’ ఆడియన్స్ మనసు దోచుకున్నాడా, లేక టైం వేస్ట్ చేశాడా? అనేది మన రివ్యూలో చూసేద్దాం!
డైరెక్టర్ శ్రీను కంబాల ఈ సినిమాను ఒక అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కథలో లెక్కలేనన్ని మలుపులు, ట్విస్టులు పెట్టి ఆడియన్స్‌ని థ్రిల్ చేద్దామని గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ, ఆ ట్విస్టులే సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. అసలు కథలో సహజత్వం లోపించడం, ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాకపోవడం కాస్త ఇబ్బంది పెడుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు వన్ మ్యాన్ షో హీరో మౌళి తనూజ్. కథ పేలవంగా ఉన్నా, మౌళి తన యాక్టింగ్‌తో సినిమాను నిలబెట్టడానికి చాలా కష్టపడ్డాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ, తన మార్క్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, డ్యాన్సులతో ఆకట్టుకున్నాడు. మౌళి పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ, కథ బాగోకపోవడంతో అతని కష్టం వృధా అయిందనిపిస్తుంది.
హీరోయిన్ సుస్మిత శెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న అమ్మాయే కానీ, ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. ఇక సీనియర్ నటులు ఆలీ, రఘుబాబు, రజిత, ప్రియ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. గుండు సుదర్శనం, భద్రమ్ కొత్త లుక్‌లో కనిపించి కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ ఉన్నంతలో బాగుంది. ఇటీవల మంచి మ్యూజిక్ ఇస్తున్న సింజిత్ ఎర్రమిల్లి ఈ సినిమాకు మాత్రం యావరేజ్ అవుట్‌పుట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో అక్కడక్కడా వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆశించిన స్థాయిలో లేని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. జబర్దస్త్ తరహా కామెడీని ఇష్టపడే వారికి మాత్రం కొన్ని సీన్స్ బాగా నచ్చుతాయి.
అయినా మొదట ఈ సినిమాకు మొదట ‘దొంగ నా కొడుకు’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు.అయితే, ఈ టైటిల్ పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ చిత్రబృందం తెలివిగా ఆ పేరును షార్ట్ కట్ చేసి డీఎన్‌కే’గా మార్చేసింది. సో, ఓవరాల్‌గా డీఎన్‌కే సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎలాంటి లాజిక్స్ వెతక్కుండా, పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్‌తో సరదాగా ఒకసారి నవ్వుకోవచ్చు. మౌళి యాక్టింగ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ, ఒక మంచి కథ ఉన్న సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.
