SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Ghmc Officer Bribe Case Acb Arrest Hyderabad

పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 6 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

హైదరాబాద్ మహానగరంలో లంచగొండి అధికారుల గుట్టురట్టు చేసే పనిలో ఏసీబీ అధికారులు మరో భారీ వికెట్ పడగొట్టారు. GHMC టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేస్తూ.. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ఒక లేడీ అధికారిణిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెహదీపట్నం GHMC కార్యాలయంలో టౌన్ ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్‌ సునీత.. ఇప్పుడు ఏసీబీ వలలో చిక్కిన అడ్డగోలు అవినీతి తిమింగలంగా మారారు.

Advertisement

ఒక భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా, సదరు నిర్మాణదారుడిని సునీత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పర్మిషన్ కావాలంటే ఏకంగా 8 లక్షల రూపాయల మామూళ్లు ఇచ్చుకోవాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు, ఇప్పుడు డబ్బులిస్తే భవిష్యత్‌లోనూ మీ నిర్మాణానికి ఎలాంటి డోకా లేకుండా సహకరిస్తానంటూ ఆ బిల్డర్‌కు గట్టి భరోసా కూడా ఇచ్చింది. అయితే సదరు బాధితుడు ఈ అక్రమ వసూళ్లపై నిశ్శబ్దంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. అధికారులు ఒక పక్కా స్కెచ్ వేశారు.

ఖైరతాబాద్‌ జోన్‌ కార్యాలయం బయట సునీత తన కారులో కూర్చుని..బాధితుడి నుంచి తొలి విడతగా నాలుగు లక్షల రూపాయల లంచం డబ్బులు తీసుకుని, తన కారులో పెట్టించుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఎటాక్ చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో ఆగని అధికారులు ఆమె కారును తనిఖీ చేయగా.. ఈ లంచం సొమ్ము కాకుండా, లెక్కల్లో చూపని మరో రెండున్నర లక్షల రూపాయల అదనపు నగదు కూడా లభ్యమవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. మొత్తంగా సునీత వద్ద నుంచి ఆరున్నర లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమెను వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో సునీత నివాసంలో అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ లేడీ ఆఫీసర్ లంచం భాగోతం కేవలం నాలుగు లక్షలతోనే ఆగిపోలేదని, దీని వెనుక ఒక పెద్ద అవినీతి తిమింగలాల నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి. సునీత ఇంట్లో ఏసీబీ అధికారులు జరుపుతున్న సోదాల్లో.. బినామీ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, విలువైన బంగారు ఆభరణాలు పలు బ్యాంక్ లాకర్ల తాళాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం లీకైంది. మెహదీపట్నం పరిధిలో గత కొన్ని నెలలుగా ఆమె క్లియర్ చేసిన టౌన్ ప్లానింగ్ ఫైళ్లన్నింటినీ అధికారులు ఇప్పుడు రీ-వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా సీజ్ చేస్తున్నారు.
అంతేకాదు, ఈ అక్రమ వసూళ్ల వెనుక జీహెచ్‌ఎంసీ కి చెందిన మరికొందరు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందనే కోణంలో ఏసీబీ ఇంటరాగేషన్ ముమ్మరంగా సాగుతోంది.

తులసీరామ్‌ సునీతను ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు అధికారులు. ఒక పక్కా బిల్డింగ్ పర్మిషన్ కోసం ఒక సాధారణ సిటిజన్ నుంచి ఇంత భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేయడంపై నగరవ్యాప్తంగా ఉన్న బిల్డర్లు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నగరంలో టౌన్ ప్లానింగ్ అధికారుల వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా ఉంటే.. భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. మరి ఈ సోదాల్లో ఇంకా ఎన్ని కోట్ల అక్రమ ఆస్తులు బయటపడతాయో, ఈ అవినీతి చేతుల్లో ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయో చూడాలి!

Tags :

  • ACB Hyderabad
  • GHMC ACB Raid
  • GHMC Bribe Case
  • GHMC Corruption
  • GHMC News
  • GHMC Officer Bribe
  • GHMC Officer Bribe Case
  • GHMC Town Planning
  • GHMC అధికారిణి
  • Hyderabad ACB
  • hyderabad news
  • Mehdipatnam GHMC
  • Sunitha Bribe Case
  • ఏసీబీ దాడులు
  • లంచం కేసు
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైదరాబాద్ మాజీ మేయర్ కన్నుమూత

హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

  • మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో నేటి నుంచి బార్లు, రెస్టారెంట్ల బంద్

    మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో నేటి నుంచి బార్లు, రెస్టారెంట్ల బంద్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

    SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • 8 ఏళ్ళ కొడుకుని రైలు ఎక్కించి వదిలించుకుంది! మొదటి భర్తకి పుట్టడమే శాపమా?

    8 ఏళ్ళ కొడుకుని రైలు ఎక్కించి వదిలించుకుంది! మొదటి భర్తకి పుట్టడమే శాపమా?

  • Hyderabad: కొడుకుని రైలెక్కించి వదిలించుకున్న తల్లి.. కారణం?

    Hyderabad: కొడుకుని రైలెక్కించి వదిలించుకున్న తల్లి.. కారణం?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • విండీస్‌తో T20 సిరీస్..13 మార్పులు! కొత్త కెప్టెన్! టీమిండియా సంచలన నిర్ణయం

  • పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

  • ట్విన్ టవర్స్ తరహా దాడి ప్లాన్? ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

  • నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam