వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కొట్టిన ఊపులో ఉన్న టీమిండియా… ఇప్పుడు పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది! వెస్టిండీస్‌తో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ అనూహ్యమైన జట్టును ప్రకటించింది. ఏకంగా 13 మార్పులతో, యువ రక్తానికి పెద్దపీట వేస్తూ ఒక కొత్త టీమిండియాను మైదానంలోకి దించుతున్నారు!
ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు! గడిచిన ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన యంగ్ స్టార్స్‌కి ఈ సిరీస్‌లో పెద్ద పీట వేశారు. టాప్ ఆర్డర్‌లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ల రూపంలో విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లను మొదటి ఓవర్ నుంచే ఉతికేయడానికి ఈ డాషింగ్ ఓపెనర్లు సిద్ధంగా ఉన్నారు!

ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… బౌలింగ్ లైనప్! ఎలాంటి ముందస్తు అంతర్జాతీయ అనుభవం లేకపోయినా, డొమెస్టిక్ టోర్నీల్లో వేగానికి మారుపేరుగా నిలిచిన మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లను నేరుగా టీ20 జట్టులోకి ఎంపిక చేశారు సెలక్టర్లు.
జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో… ఈ యంగ్ పేసర్లకు తమ స్పీడ్ పవర్ ఏంటో చూపించడానికి ఇది ఒక సువర్ణావకాశం! అలాగే ఆల్‌రౌండర్లుగా నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టుకు కొండంత అభయాన్ని ఇస్తున్నా
మరోవైపు కేవలం ఇండియా మాత్రమే కాదు… విండీస్ దళం కూడా ప్రమాదకరంగా మారింది. శాయ్ హోప్ నాయకత్వంలో దిగుతున్న వెస్టిండీస్ జట్టులోకి రోవ్‌మన్ పావెల్, సిమ్రాన్ హెట్మైర్, అకీల్ హోసేన్ వంటి టి20 స్పెషలిస్టులు తిరిగొచ్చారు.ఈ భారీ పోరుకు లక్నోలోని ఇకానా క్రికెట్ స్టేడియం వేదిక కాబోతోంది. తొలి టీ20 నుంచే బౌండరీల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది!
