మనోళ్లు చాలామంది ‘రైల్వే మనదే.. ట్రైన్ మనదే’ అనుకుని టికెట్ లేకుండా దర్జాగా ఎక్కేస్తుంటారు. టీటీఈ వస్తే బాత్రూమ్‌లలో దాక్కోవడం, లేదంటే ఏదో ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వడం చూస్తుంటాం కదా? ఇకపై ఆ పప్పులు ఉడకవు బాస్! ఈ జన విశ్వాస్ చట్టం ప్రకారం వితౌట్ టికెట్ దొరికితే ముక్కు పిండి వసూలు చేస్తారు. అపరాధ రుసుములను, అంటే జరిమానాలను భారీగా పెంచేశారు. చిన్న చిన్న తప్పులకి జైలు శిక్షలు తీసేశారు కానీ.. జేబులు గుల్ల చేసేలా ఫైన్లు మాత్రం గట్టిగా బాదబోతున్నారు. టికెట్ లేకుండా ఎక్కారా.. మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!”
ఇక రెండో పాయింట్.. చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్. కొంతమంది మహానుభావులు ట్రైన్ రాగానే రష్ ఎక్కువ ఉందని చూసుకోకుండా లేదా కావాలనే ‘మహిళల బోగీల్లోకి దూరేస్తుంటారు. లేడీస్ సీట్లలో కూర్చుని సీన్లు క్రియేట్ చేస్తుంటారు. ఇకపై ఏ మగాడైనా లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో కనిపిస్తే.. నెక్స్ట్ స్టేషన్ వచ్చేలోపు మీ పని అయిపోద్ది! ఎందుకంటే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు గవర్నమెంట్ అన్‌లిమిటెడ్ పవర్స్ ఇచ్చింది. అదనపు బాధ్యతలు అప్పగించింది. స్పాట్ లోనే మిమ్మల్ని లాగి పడేసి, భారీ ఫైన్ తో పాటు గట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. సో, రూల్స్ బ్రేక్ చేయాలని చూస్తే.. తాట లేచిపోద్ది, జాగ్రత్త!
ఇక్కడ మీకో డౌట్ రావచ్చు.. ‘అన్నా, చిన్నపాటి నేరాలకు జైలు శిక్షలు తీసేశారు కదా, ఇక మాకేం భయం?’ అని కాలర్ ఎగరేయకండి ! గవర్నమెంట్ ఇక్కడే పెద్ద స్కెచ్ వేసింది. కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పడం ఎందుకని జైలు శిక్ష తీసేసింది కానీ.. దానికి బదులుగా మీ అకౌంట్లు ఖాళీ అయ్యేలా అపరాధ రుసుములు పెంచింది. ట్రైన్లలో క్రమశిక్షణ, భద్రత పెంచడానికే ఈ జన విశ్వాస్ చట్టం తెచ్చారు. రైల్వే ఆస్తులను పాడు చేసినా, రూల్స్ అతిక్రమించినా ఆర్పీఎఫ్ పోలీసులు ఇకపై పక్కా మాస్ యాక్షన్‌లోకి దిగుతారు. లంచాలు ఇద్దాం, మేనేజ్ చేద్దాం అంటే కుదరదు.. వప్పుకోరు.. అంతా ఆన్‌లైన్ సిస్టమ్, పక్కా రూల్స్!”
చూశారుగా ఇదీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జన విశ్వాస్ చట్టం అసలు కథ! అందుకే ఇకపై రైలు ప్రయాణం చేసేటప్పుడు పద్ధతిగా టికెట్ తీసుకోండి, రూల్స్ పాటించండి. హ్యాపీగా, సేఫ్‌గా మీ ఊరు చేరుకోండి. ఈ సమాచారం మీ ఒక్కరికే తెలిస్తే సరిపోదు.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్‌ను ఇప్పుడే షేర్ చేయండి. వాళ్లను కూడా అలర్ట్ చేయండి.
