లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం… చేతినిండా సంపాదన అని నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడో యువకుడు. పెళ్లి పేరిట కట్నకానుకలు, లండన్‌లో సొంతింటి పేరిట కోట్ల విలువైన ఆస్తిని కాజేసి, కట్టుకున్న భార్యను గెంటేసి విదేశాలకు చెక్కేశాడో ఘరానా భర్త. న్యాయం కోసం నిలదీస్తే అత్తింటి బంధువులు దాడులకు తెగబడ్డారు.దీంతో పాపం చేసేదేమి లేక న్యాయపోరాటిని దిగింది బాధితురాలు…
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కొండ్లే రజిత-సతీష్ కుమార్ దంపతుల కుమార్తె దివ్య. ఆమెకు వరంగల్ శివనగర్‌కు చెందిన మచ్చ పవన్ కుమార్‌తో 2022 ఆగస్టులో వైభవంగా వివాహం జరిగింది. పవన్ లండన్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని, తమ కుమార్తె జీవితం విదేశాల్లో సుఖంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు నమ్మారు. పెళ్లి సమయంలో ఘనంగా కట్నకానుకలు సమర్పించుకున్నారు. ఏకంగా 191 గజాల విలువైన ఖరీదైన ప్లాట్, 5 తులాల బంగారం, రూ. 5 లక్షల నగదు కట్నంగా ముట్టజెప్పారు. ఇక పెళ్లయిన కొన్నాళ్లకు భర్త పవన్ దివ్యను లండన్‌కు తీసుకెళ్లాడు. విదేశాల్లో సంబరంగా బతుకుతారనుకున్న ఆ యువతికి రోజూ కన్నీళ్లే మిగిలాయి. “లండన్‌లో మనంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, దానికోసం మీ పుట్టింటి స్థలాన్ని అమ్మేయ్” అంటూ పవన్, అతని సోదరి కలిసి దివ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. భర్తే తన సర్వస్వమని నమ్మిన ఆ అమాయక యువతి తన తల్లిదండ్రులను ఒప్పించింది. నర్సంపేటలోని 191 గజాల ప్లాట్‌ను 40 లక్షలకు విక్రయించి, ఆ మొత్తం నగదును భర్త చేతిలో పెట్టింది…

ఇక దివ్య చేతిలో నుంచి రూ. 40 లక్షల నగదు, ఒంటిపై ఉన్న బంగారం చేజిక్కించుకున్నాక పవన్ వక్రబుద్ధి పూర్తిగా బయటపడింది. భార్యను ప్రేమించడం మానేసి, నిత్యం భౌతిక దాడులకు పాల్పడుతూ నరకం చూపించాడు. చివరకు 2025 ఏప్రిల్‌లో ఆమెను భారత్‌కు బలవంతంగా పంపించేసి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాను మళ్లీ లండన్‌కు పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. తన తల్లితో కలిసి అత్తింటి బంధువుల సాయంతో నాగరాజు స్థలం వద్దకు వెళ్లి న్యాయం చేయాలని నిరసనకు దిగింది. కానీ పశ్చాత్తాపం పడాల్సింది పోయి, ప్రశాంతి కుమారుడు మాధవ్ ఆ యువతిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దుర్భాషలాడుతూ నడిరోడ్డుపై ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. “లండన్ పేరుతో నా జీవితాన్ని, సర్వస్వాన్ని నాశనం చేశారు. కట్నం డబ్బులు, ఆస్తి కాజేసి లండన్‌కు పారిపోయిన భర్తపై, తనను కొట్టి వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దివ్య నిరసనకు దిగింది..

ఇక తన బిడ్డ జీవితం బాగుటుందని తమకున్న ఆస్తి మొత్తం అమ్మి ఘనంగా పెళ్లి చేశామని..కానీ పవన్ పెట్టిన ఇబ్బందుకు గుండెపోటుతో భర్త, ఇటూ తమ బిడ్డ జీవితం నాశనమైందని..తమకు న్యాయం కావాలంటూ దివ్య తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది… చదువుకున్నాడు,మంచి జాబ్ చేస్తున్నాడని దివ్య తల్లిదండ్రులు వారి ఉన్నదానికంటే ఎక్కువగాపెట్టి పెళ్లి చేశారు..చివరి ఇలా జరగడం నిజంగా బాధకరం..బిడ్డ జివితం ఇలా అయిందని తండ్రి గుండెపోటుతో చనిపోయాడు..ఇప్పుడు వారు ఒంటరైయ్యారు..న్యాయం కోసం పోరాడుతున్నారు.. ఇలాంటి ఎన్ఆర్ఐ మోసాలు జరగడం ఇదే మొదటిసారి ఏమికాదు.. విదేశాలో ఉండే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తమ బిడ్డ భవిష్యత్ బాగుంటుదని నమ్మే తల్లిదండ్రుల నమ్మకాన్ని ఇదిగో ఇలాంటి వ్యక్తులు ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు…
