ప్రభాస్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే అప్డేట్ ఇది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కూలీ, వార్ 2 ప్రదర్శితమయ్యే థియేటర్లలో బాహుబలి కొత్త వెర్షన్ బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే మరి
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మహేశ్ బాబు పుట్టిన రోజు బహుమతిగా SSMB29 ప్రీ లుక్‌తో సంచలనం రేపాడు. అప్పటి నుంచి పూర్తి స్థాయి లుక్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. మహేశ్ బాబు రాజమౌళి సినిమా ఫుల్ పూర్తి ప్రీ లుక్ నవంబర్ నెలలో ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ఎప్పట్నించో ఎదురు చూస్తున్న మరో బిగ్ అప్డేట్ విన్పిస్తోంది. బాహుబలి సీక్వెల్ టీజర్ విడుదలపై వార్తలు వస్తున్నాయి. బాహుబలి సీక్వెల్ అంటే మూడో భాగం బాహుబలి ది ఎపిక్‌గా రానుంది. ఇందులో అదనపు సీన్స్, ఎక్కువ రన్ టైమ్ ఉండనున్నాయి. ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్పై బజ్ క్రియేట్ అవుతోంది.
ఈ క్రమంలోనే బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల గురించి చర్చ మొదలైంది. ఆగస్టు 14వ తేదీన వార్ 2, కూలీ సినిమా ధియేటర్లలో బాహుబలి ది ఎపిక్ టీజర్ ఉంటుందనే వార్తలు ప్రభాస్ అభిమానుల్ని ఖుష్ చేస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభాస్, దగ్గుబాటి రాణా, అనుష్క, తమన్నా భాటియా, రమ్య కృష్ణ, సత్యరాజ్ నటించిన బాహుబలి కొత్త వెర్షన్ అక్టోబర్ 31న విడుదల కానుంది.