సూపర్ స్టార్ రజనీకాంత్. నిజ జీవితంలో ఎలాంటి వివాదం లేని వ్యక్తుల్లో ఒకరు. కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతున్న రజనీ జీవితంలో ఓ అమ్మాయి ఉందని..ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం రజనీ వెతుకుతున్నాడంటే నమ్మగలరా…
సాధారణ బస్ కండక్ఠర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన స్టైలిష్ రజనీకాంత్ కొత్త సినిమా కూలీ మరో పది రోజుల వ్యవధిలో విడుదల కానుంది. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా తన జీవితంలో మర్చిపోలేని, ఇప్పటికీ తల్చుకుంటున్న ఓ సంఘటన గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కెరీర్ పరంగా ఇంతలా ఎదిగినా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకు ఉంటావని ఓ సహ నటుడు అడిగిన ప్రశ్నకు తాను చెప్పిన సమాధానాన్ని మరోసారి గుర్తు చేశారు. నిజంగానే ఇది మర్చిపోలేని, ఉద్వేగం నిండిన ఘటన. సూపర్ స్టార్ రజనీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ అమ్మాయి విషయం ఇది. ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం తన కళ్లు వెతుకుతూనే ఉన్నాయంటున్నారు రజనీ కాంత్.
రజనీ జీవితంలో ఆ అమ్మాయి ఎవరు
రజనీ కాంత్ కండక్టర్‌గా పనిచేసేటప్పుడు బస్సులో ఓ అమ్మాయితో పరిచయం గొడవగా మారి ఆ తరువాత స్నేహానికి దారి తీసింది. ఓ రోజు ఆర్ట్ అండ్ కల్చరల్ ధియేటర్‌లో డ్రామా చూసేందుకు వస్తావా అనడిగితే..యాక్టింగ్ కూడా చేస్తావా అని ఆశ్చర్యపోయిందని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు ఇద్దరూ బయట కలుసుకున్నప్పుడు నీలో మంచి నటుడున్నాడు..సినిమాల్లో ప్రయత్నించమని చెప్పడమే కాకుండా తన ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని కొంత డబ్బు ఇచ్చి మంచి ఫోటో షూట్ సిద్ధం చేసుకోమని చెప్పిందన్నారు. ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్లి పరిచయం చేసుకోవాలని..నాలో ఏదో మ్యాజిక్ ఉందని, ఏదో ఒక రోజు గొప్ప నటుడివి అవుతావని ఆ రోజే చెప్పిందంటూ కళ్లలో నీరు తుడుచుకున్నారు. ఆ తరువాత కూడా చాలా సందర్భాల్లో ఆర్ధిక సహాయం చేసి..మనస్థైర్యాన్ని ఇచ్చేదన్నాడు. అయితే తీరా యాక్టర్ అయ్యాక ఎప్పుడూ కన్పించలేదన్నాడు. అప్పటి నుంచి తన కోసం వెతకని ప్రదేశం లేదంటూ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశారు.
తాను ఈ రోజు బతికున్నానంటే…ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ అమ్మాయే కారణమని చెబుతున్న రజనీకాంత్‌కు ఏదో రోజు తాను కన్పిస్తుందనే నమ్మకం ఉందంటున్నారు. ఈ కధ విన్న ఫ్యాన్స్ కూడా రజనీ కాంత్ ఆ అమ్మాయిని కలవాలని ఆశిస్తున్నారు. తన విజయాన్ని అందరి కంటే ముందు చూసింది ఆ అమ్మాయేనంటున్న రజనీ కాంత్ కోరిక నెరవేరుతుందా మరి..