టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడనే విషయం మీకు తెలుసా. ఏ సినిమా మిస్ చేసుకున్నాడు..ఎవరి సినిమా అది…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 1, పుష్ప 2 భారీ విజయం కంటే ముందే దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పుష్పరాజ్..పుష్ప సిరీస్ సినిమాలతో రేంజ్ దాటిపోయాడు. మంచి నటనతో పాటు కేరక్టర్ కలిగిన హీరోగా అభివర్ణించవచ్చు. పుష్ప 3 అప్పుడే తెరకెక్కకపోయినా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా సన్నాహాల్లో ఉన్నాడు. ఇది ఏకంగా హాలీవుడ్ స్థాయిలో నిర్మితమౌతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..కేరళ, కర్ణాటకతో పాటు ఉత్తరాదిన కూడా భారీగా అభిమానులు కలిగి ఉన్నారు. గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిందట. ఎందుకో ఆ సినిమాను అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు.
అల్లు అర్జున్ మిస్ అయిన ఆ హిట్ సినిమా ఏది
నితిన్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి అల్లు అర్జున్ జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సింది. కానీ ఎందుకో కొన్ని కారణాలతో మిస్ అయింది. ఆ తరువాత రాఘవేంద్రుడు తెరకెక్కించిన గంగోత్రితో ఎంట్రీ ఇచ్చాడు. లేకపోతే అల్లు ఎంట్రీ సైతం సూపర్ డూపర్ హిట్ అయుండేది.
జయం సినిమాను మిస్ చేసుకున్నందుకు అల్లు అర్జున్ రిగ్రెట్ అవుతున్నాడో లేదో గానీ ఆ సినిమా తనకు లభించినందుకు నితిన్ మాత్రం అల్లుకు కృతజ్ఞతలు చెప్పుకోవల్సిందే.