రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న తలైవాని తన మ్యాజిక్ తో తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీతో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆల్ సినిమా థియేటర్స్ ని తన రికార్డుల సునామీతో ఏ మాత్రం మొహమాటం లేకుండా ముంచెత్తుతూ ముందుకు దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇకపోతే ఫై ఫోటోలో రజనీకాంత్ ఒడిలో ఉన్న బుల్లి బాబుకి, జైలర్ సినిమాకి సంబంధం ఉంది. సంబంధం ఉండటమే కాదు.. జైలర్ మూవీ ఘన విజయంలో తన వంతు పాత్ర కూడా చాలా ఉంది. జైలర్ సినిమా ఘన విజయంలో తన పాత్ర కూడా ఉందా? మాకు తెలియకుండా ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటున్నారా. ఇంకొంచెం టైం ఇస్తున్నా. రజనీకాంత్ ఎత్తుకున్న ఆ బాబు ఎవరో గుర్తుపట్టి చెప్పండి లేదా ఇంకాసేపు వెయిట్ చేస్తే ఆ బాబు ఎవరో చెప్తా. ఆ తర్వాత ఆనందం తో మీ అంతట మీరే పూనకంతో ఉగిపోయేలా డాన్స్ చేస్తారు.
రజనీకాంత్ ఒడిలో ఉన్న ఆ బాబు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక సంచలనం. 30 సంవత్సరాల క్రితం రజనీకాంత్ అనుకుని ఉండడు.. తాను ఎత్తుకున్న బాబు, తనను తలెత్తుకునేలా చేస్తాడని. చాలా ప్లాప్స్ తర్వాత సరైన హిట్ పడింది రజినీ ఖాతాలో. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది ఆ బాబే. బహుశా రజనీకాంత్ ఆ బాబుని ఎత్తుకొని ఉన్నప్పుడు బాబుకి ప్రపంచాన్ని చూపించాలని అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ బాబే రజనీకాంత్ ని ప్రపంచానికి సరికొత్తగా ప్రెజెంట్ చేసి చూపించాడు. చూపించాడు అనడం కంటే రజినీకాంత్ ని సరికొత్తగా ప్రపంచానికి వినిపించాడు అనడం బెటర్. ఎందుకంటే మనోడు మాంచి సంగీత కళాకారుడు కాబట్టి.
ఆ బాబు మరెవరో కాదు.. చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్న అనిరుద్ రవిచందర్. అవును ఆ ఫొటోలో రజనీకాంత్ ఎత్తుకొని ఉంది అనిరుద్ నే. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం రజినీకాంత్ కి సంబంధిన ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూట్ గ్యాప్ లో అనిరుద్ ని రజనీకాంత్ ఎత్తుకొని ఆ ఫోటో దిగాడు. అనిరుద్ స్వయానా రజినీకాంత్ కి మనవడు వరస అవుతాడు. రజనీకాంత్ భార్య లత మేనల్లుడైన ప్రముఖ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కొడుకే అనిరుద్. ఇప్పుడు ఈ ఫోటోతో రజినీకాంత్ కి, అనిరుద్ కి ఉన్న బంధుత్వం చాలా మందికి తెలిసింది. అలాగే బుడిబుడి నడకలు కూడా రాని వయసులో అనిరుద్ ని ఎత్తుకున్న రజనీకాంత్ .. ఇప్పుడు తన కళ్ళముందే హుకుం సాంగ్ తో ఎంత రచ్చ రచ్చ చేసాడో చూసి పొంగిపోవడం ఖాయం. అలాగే అనిరుద్ కూడా ఇంత గొప్ప స్థాయికి రావడం గ్రేట్ అని అంటున్నారు.