బిగ్‌బాస్ మరోసారి దుమ్మురేపేందుకు సిద్ధమౌతోంది. చదరంగం కాదు..ఈసారి రణరంగమే అంటున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గురించి ఆసక్తికరమైన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈసారి బిగ్‌బాస్ కార్యక్రమంలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందంటున్నారు. ఆ షాకింగ్ అంశాలేంటో చూద్దాం.
దాదాపు మరో నెల రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్న ఈ షోలో ఈసారి చాలా సంచలన అంశాలు కన్పించనున్నాయి. బహుశా అందుకే అనుకుంటా ప్రోమోలో కూడా చదరంగం కాదు ఈసారి రణరంగమే అని విన్పిస్తోంది. అంతేకాదు ఈసారి రెండు హౌస్‌లు..రెండు డోస్‌లు అంటూ దుమారం రేగుతోంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే వారికి విధిస్తున్న షరతులు కూడా చాలా ఆశ్చర్యం కల్గించనున్నాయి. ఈ రూల్స్ గురించి టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్‌కు వివరిస్తూ..డబుల్ హౌస్-డబుల్ డోస్ అని నాగార్జున చెప్పడం విశేషం.
బిగ్‌బాస్‌నే మార్చేశారా, బిగ్‌బాస్ అసలు ఉండడా
ఈసారి జరిగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 పూర్తిగా విభిన్నంగా ఉండనుంది. రెండు హౌస్‌లు ఉండటమే కాదు అసలు బిగ్‌బాస్ ఉండకపోవచ్చనే వాదన విన్పిస్తోంది. అంతేకాదు ఈసారి బిగ్‌బాస్‌నే మార్చేసినట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ లేకుండా రెండు హౌస్‌లు ఎలా ఉంటాయి, కంటెస్టెంట్లను ఎవరు నిర్దేశిస్తారు. ఎవరు కంట్రోల్ చేస్తారనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. అసలు ఈసారి బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ముగ్గురు సామాన్యులు
ఈసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో కేవలం సెలెబ్రిటీలు. యూట్యూబర్లే కాకుండా అత్యంత సామాన్య ప్రజలు కూడా ముగ్గురు ఉంటారని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే 40 మందిని ఎంపిక చేసిన బిగ్‌బాస్ యాజమాన్యం ముగ్గురిని ఫైనల్ చేసే పనిలో ఉంది. గత సీజన్ మాదిరే ఉంటుందనే ఆలోచన తీసివేయాలని నాగార్జున చెప్పడం ద్వారా హైప్ మరింత పెరిగింది. రెండు హౌస్‌లు అంటున్న క్రమంలో ఎంతమంది కంటెస్టెంట్లు వస్తారు. ఎంతమంది నిలుస్తారనేది మరో ప్రశ్నగా మారింది.