సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్-అభిషేక్ జైశ్వాల్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం జటాధర టీజర్ విడుదలైంది. ప్రభాస్ లాంచ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఈసారి తెలుగుతో పాటు హిందీ చలనచిత్ర పరిశ్రమలో అడుగెడుతున్నాడు. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న జటాధరలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాతో నటించనున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఉమేష్ కేఆర్ బన్సాల్, ప్రేమా అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందాలు భారీ ఎత్తున సినిమా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా జటాధర టీజర్ డిజిటల్ వెర్షన్ ఇవాళ లాంచ్ అయింది. టీజర్ చాలా అగ్రెసివ్‌గా ఆకట్టుకుంటోందని ప్రభాస్ పేర్కొన్నాడు. సుధీర్ బాబుతో సహా సినిమా టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు. టీజర్‌ని బట్టి మంచికి చెడుకు మధ్య జరిగిన పోరాటం నేపధ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆధ్యాత్మిక కధా నేపధ్యంతో సాగే సినిమాలో సోనాక్షి సిన్హా దుష్టశక్తి పాత్రలో కన్పించనుంది. సోనాక్షి సిన్హాతో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై సుధీర్ బాబు చాలా ఆశలు పెట్టుకున్నాడు.