నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 32 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నైజీరియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఈ మిలిటరీ ఫ్లైట్ బెనిన్ సిటీ నుంచి లాగోస్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మార్గమధ్యంలో ఉన్న ఇగ్బోకోడా ప్రాంతానికి చేరుకోగానే విమానంపై కంట్రోల్ తప్పి కిందకు దూసుకొచ్చి క్రాష్ అయింది. ఈ ఫ్లైట్‌లో మొత్తం 32 మంది ప్రయాణిస్తుండగా.. అందులో 25 మంది ప్యాసింజర్స్, ఏడుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు. ప్రమాదం జరిగిన తీవ్రతకు విమానంలో ఉన్న 32 మంది కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వెదర్ కండిషన్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా లేదా విమానంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ తలెత్తిందా అనే కోణంలో ఎయిర్‌ఫోర్స్ టీమ్స్ రీసెర్చ్ చేస్తున్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ దెబ్బతిన్న విమాన శిథిలాలను పరిశీలిస్తున్నాయి. బ్లాక్ బాక్స్ లభ్యమైతేనే ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.”
ఈ విషాదకర ఘటనపై నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ.. ఈ యాక్సిడెంట్‌పై తక్షణమే సమగ్ర హైలెవెల్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో నైజీరియా ఎయిర్‌ఫోర్స్‌లో ఇలాంటి ఘోర భద్రతా లోపాలు, ప్రమాదాలు రిపీట్ కాకుండా గట్టి యాక్షన్ ప్లాన్ తీసుకుంటామని, విమానాల సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెడతామని ప్రెసిడెంట్ హామీ ఇచ్చారు.సైనిక విమానాలు తరచూ ప్రమాదాలకు గురికావడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నైజీరియా ఎయిర్‌ఫోర్స్ భద్రతపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
