బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్ అంటూ నాగార్జున ఇస్తున్న హింట్స్‌తో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్లు ఎవరనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ముగ్గురు సెలెబ్రిటీస్ పేర్లు విన్పిస్తున్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజులు కూడా లేదు. కంటెస్టెంట్లు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. తొలిసారిగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొననున్నారు. సామాన్యుల ఎంపిక కోసం ప్రీ షో నడుస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజీత్, బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందుమాధవి, బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ నవదీప్ న్యాయనిర్ణేతలుగా ఈ ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. దరఖాస్తులు వేలల్లో వచ్చినా 40మందిని ఎంపిక చేశారు. ఈ 40 మంది నుంచి 15 మందిని ఫైనల్ చేసి చివరిగా బిగ్‌బాస్ హౌస్‌లో 4-5 మందిని ఎంపిక చేయనున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో లక్స్ పాప
లక్స్ పాపగా ప్రాచుర్యం పొందిన ఒకనాటి టాలీవుడ్ హీరోయిన్ ఆషా షైని అలియాస్ ఫ్లోరా షైని బిగ్‌బాస్ హోస్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ తన సోదరుడితో తీసిన 143లో ఈమె చివరిసారిగా నటించింది. ఆ తరువాత హిందీలో బోల్డ్ వెబ్ సిరీస్‌లో కన్పించింది. తన గ్లామర్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో సందరి చేసేందుకు ఆషా షైని సిద్ధమౌతోంది. అయితే అధికారికంగా ఇంకా వెల్లడి కావల్సి ఉంది.
ఇక సోషల్ మీడియా సెలెబ్రిటీల్లో భాగంగా ముగ్గురి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లుయెన్సర్‌గా, ఫోటోలు-వీడియాలతో ఆకట్తుకుంటున్న దమ్ము శ్రీజ, అనుష రత్నం పేర్లు విన్పిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి పేరు కూడా విన్పిస్తోంది.