టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త మనవరాలితో జరిగిన నిశ్చితార్ధంలో రెండు కుటుంబాల వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత జట్టు మాజీ క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లిపీటలెక్కుతున్నాడు. ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్ధం జరిగింది. అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి తేదీ ఇంకా నిశ్చయం కావల్సి ఉంది. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
సానియా చందోక్ ఎవరు, ఎంత సంపాదిస్తుందో తెలిస్తై మైండ్ బ్లాక్
ముంబైలోని ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్లూక్లీన్ క్రీమరీ ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో పాటు ఇతర వ్యాపారాలున్నాయి. ఈమె కుటుంబానికి ముంబైలో మంచి పేరుంది. మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్‌లో ఈమె ఓ డైరెక్టర్. గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత ఏడాది అంటే 2023-24లో 624 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక కాంటినెంటల్ హోటల్స్ విలువ 18.43 బిలియన్ డాలర్లుగా ఉంది.