ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరిగిన సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన కింగ్.. అదే జోరుతో 500వ అంతర్జాతీయ మ్యాచ్ చిరస్మరణీయం చేసుకున్నాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. టెస్టు క్రికెట్‌లో 29వ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 76వ సెంచరీ కాగా.. 100 శతకాలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లలో కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. జో రూట్ (ఇంగ్లండ్) 46, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 45, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), రోహిత్ శర్మ 44 సెంచరీలతో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 మంది ప్లేయర్లు ఇప్పటి వరకు 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. వారిలో విరాట్ మాత్రమే మైలురాయి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు.
ట్రిక్కీ పిచ్‌పై విరాట్ తన క్లాస్ ఆటతో అదరగొట్టాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (57), రోహిత్ శర్మ (80) అర్ధశతకాలతో రాణించి టీమిండియాకు మెరుగైన ఆరంభం అందించగా.. ఆ తర్వాత రోహిత్ సేన.. ఒకే సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించింది. ఈ దశలో తన అనుభవాన్నంతా రంగరించి ఆడిన కోహ్లీ.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. ఈ జంట గురువారం చివరి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి.. కరీబియన్లను విసిగించగా.. శుక్రవారం ఉదయం కూడా విరాట్ అదే జోరు కొనసాగించాడు. పదే పదే షాట్ల జోలికి పోని కోహ్లీ.. మంచి బంతులను గౌరవిస్తూనే.. చెత్త బంతులపై విరుచుకుపడ్డాడు. ఒక్కో పరుగు జోడిస్తూ.. ముందుకు సాగాడు. రోచ్, అల్జారీ జోసెఫ్, గాబ్రియల్ ఇలా బౌలర్ ఎవరన్నదానితో సంబంధం లేకుండా.. కోహ్లీ తన క్లాసికల్ ఆటతో కట్టిపడేశాడు. వన్డేల్లో 46 సెంచరీలు, టీ20ల్లో ఒక శతకం తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. టెస్టు క్రికెట్‌లో చాన్నాళ్ల తర్వాత మూడంకెల స్కోరు చేశాడు. అహ్మదాబాద్‌లో శతక్కొట్టిన తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి జాలువారిన విలువైన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం.
విరాట్ విరోచిత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 180 బంతుల్లో విరాట్ 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గాబ్రియల్ బంతిని స్వైర్ లెగ్ దిశగా పంపి విరాట్ తన 500వ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టిలేపే విరాట్ అచ్చం అలాంటి ఇన్నింగ్స్‌తోనే అలరించాడు. కోహ్లీ సెంచరీ పూర్తయిన మరుక్షణమే.. జడేజా కూడా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 317 పరుగులతో నిలిచింది. ఇలా.. 500వ టెస్ట్ ఆడుతూ.. ఆ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్ కోహ్లీ కావడం విశేషం.
#INDvWI
Fab 4 Test centuries:1. Steven Smith – 32.
2. Joe Root – 30.
3. Virat Kohli – 29*.
3. Kane Williamson – 28.But for akash Chopra there is only fab 3 🤡
The king Virat Kohli 🔥#ViratKohli𓃵 pic.twitter.com/NYfXKpaNxQ— 👌👑🌟🌶️ (@superking1816) July 21, 2023