మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రామ్ చరణ్. ఇండస్ట్రీలో రామ్ చరణ్ నటించిన సినిమాలు తక్కువే అయినా.. దాదాపు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకొని తనకంటూ ప్రత్యక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో హీరోగా పరిచయం అయి.. రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ మూవీతో సెన్సెషనల్ రికార్డులు క్రియేట్ చేశాడు. రామ్ చరణ్ నటించిన సినిమాలు తక్కువే అయినా.. దాదాపు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకొని తనకంటూ ప్రత్యక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో రెండోసారి ఆర్ఆర్ఆర్ మూవీలో నటించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ మూవీలో సాంగ్ ‘నాటు నాటు’ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో చోటు దక్కించుకొని రేసులో నిలిచింది. తాజాగా రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ పాన్ఇండియా స్టార్ గా మారారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయి ఏడాది కావస్తున్నా.. ఇంకా ఆ మూవీ రికార్డ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా టూర్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లో రేస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుక మార్చి 12 న జరగనుంది. అయితే రామ్ చరణ్ ముందుగానే యూఎస్ వెళ్లడంపై ఫ్యాన్స్ కి రక రకాల సందేహాలు మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కడం వల్లనే ఆయన యూఎస్ టూర్ కి ముందుగానే వెళ్లినట్లు తెలుస్తుంది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందజేస్తుంది. ఈ ఏడాది ఆరవ వార్షిక ఫిలిమ్ అవార్డులను ఫంక్షన్ లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ప్రజెంటర్ గా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ వేడుక శుక్రవారం (ఫిబ్రవరి 24) జరగనుంది. ఈ గౌరవం దక్కించుకున్నవారిలో బ్రాండన్ పెరియా, మాడేలిన్ క్లయిన్, ట్రినిటీ జో-లి బ్లీస్, వయోలెట్ మెక్ గ్రాతో పాటు డేవిడ్ డాస్మల్ చెయి లు ప్రజెంటర్లుగా ఉన్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి హీరోగా రామ్ చరణ్ మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్ అమెరికా టూర్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఏడాది హెచ్.సి.ఎ అవార్డులకు నాలుగు విభాగాల్లో ఫైనల్ నామినేషన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ చోటు సంపాదించింది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మార్చి 7 న లాస్ వేగాస్ కు వెళ్లనుంది. ఇటీవల రామ్ చరణ్ అమెరికా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వెళ్లిన సందర్భంగా అక్కడి ప్రేక్షకుల నుంచి ఎంతో గొప్ప స్పందన లభించింది. అంతేకాదు పలువురు హాలీవుడ్, నిర్మాతలు,దర్శకులు సైతం రామ్ చరణ్ నటనను కొనియాడారు. రామ్ చరణ్ కి ఇంత గొప్ప గౌరవం లభించడంపై సహ నటులు, మెగా అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ తెలుపుతున్నారు.