బస్సులో కండక్టర్ చిల్లర కోసమని ప్రయాణికులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ప్రయాణికుల టికెట్లు ఇస్తున్న క్రమంలో అప్పుడప్పుడు సరిపడ చిల్లర లేకుంటే టికెట్ వెనకాల రాసి వారు దిగే స్టాప్ లో చిల్లర ఇచ్చేందుకు టికెట్ వెనకాల రాస్తూ ఉండడం అనేది మన అందరికీ తెలిసిందే. కానీ హర్యానాలోని ఓ బస్ కండక్టర్ టికెట్ వెనకాల చిల్లరతో పాటు ఏం రాశాడో తెలిస్తే షాక్ కు గురికావాల్సిందే. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోడ్వేస్లోని ఓ కండక్టర్ బస్సులోని మహిళ ప్రయాణికురాలికి తను దిగే స్టాప్ వరకు టికెట్ ఇచ్చాడు. ఇక సరిపడా చిల్లర లేకపోవడంతో వెనకాల ఇవ్వాల్సిన చిల్లరతో పాటు తన మొబైల్ నెంబర్ ను కూడా రాశారు. ఇది చూసిన ఆ యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ వెంటనే ఆ యువతి ఇదేంటి అంటూ కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఇంటితో ఆగకుండా ఏకంగా మహిళ కమిషన్ ను ఆశ్రయించి కండక్టర్ తీరుపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మహిళ కమిషన్ ఇది ఖచ్చితంగా మహిళల వేధింపులకు కిందకే వస్తుందని, రెండు రోజుల్లోగా అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేయడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న కొందరు కండక్టర్ తీరుపై విరుచుకుపడుతున్నారు. బస్ లో ఈ కండక్టర్ ఈ పాడు పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
