విశాఖపట్నంలో విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. క్షణికావేశానికి మరో యువకుడు బలి అయ్యాడు. లైఫ్‌లో సెటిల్‌కాలేదంటూ కార్తిక్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇన్‌స్టాలో సమస్యలు చెప్పుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవలే కొన్ని జాబ్స్‌కు ప్రయత్నించి విఫలం అవడంతో మనస్తాపం చెందిన కార్తీక్.. ఇన్‌స్టా వేదికగా సమస్యలు చెప్పుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
విశాఖలో కప్పరాడ ప్రాంతంలో కార్తీక్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి మరి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది .విజయనగరం జిల్లా మెరకముడిదం ప్రాంతానికి చెందిన నారాయణరావు, దానమ్మ దంపతులు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం విశాఖపట్నం వలస వచ్చారు. వారి కుమారుడు కార్తీక్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని, ఆ తర్వాత కొంతకాలం పాటు సేల్స్ బాయ్‌గా కూడా పనిచేశారు.
అయితే, ఇటీవల కాలంలో అతను ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ వరకు చదివిన కార్తీక్..స్టడీ అయిపోయాక కొన్నాళ్లు ఖాళీగా ఉన్నాడు.తర్వాత కొన్ని జాబ్స్‌కు కూడా అప్లై చేశాడు. అయితే తాను అనుకున్న జాబ్ రాకపోడంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే, తమ్ముడు కింద గదిలో ఉన్న సమయంలో… కార్తీక్ పైన ఉన్న గదిలోకి వెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఆన్ చేశాడు. లైవ్‌లో చూస్తున్న వారందరికీ తన మనసులోని బాధలను, సమస్యలను చెప్తూ తన ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ ఘటనపై కార్తీక్ తల్లి దాలమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “లైవ్‌లో ఉన్నవారందరికీ తన సమస్యలు చెప్పిన తన కొడుకు… ఒక్క మాట ఆ బాధేంటో తనకే చెప్పి ఉంటే ఎలాగైనా ఆ సమస్యను తీర్చేదాన్ని కదా… ఇంత పెద్ద ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదు” అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
