విశాఖపట్నంలో విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. క్షణికావేశానికి మరో యువకుడు బలి అయ్యాడు. లైఫ్‌లో సెటిల్‌కాలేదంటూ కార్తిక్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇన్‌స్టాలో సమస్యలు చెప్పుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవలే కొన్ని జాబ్స్‌కు ప్రయత్నించి విఫలం అవడంతో మనస్తాపం చెందిన కార్తీక్.. ఇన్‌స్టా వేదికగా సమస్యలు చెప్పుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విశాఖలో కప్పరాడ ప్రాంతంలో కార్తీక్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి మరి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది .విజయనగరం జిల్లా మెరకముడిదం […]