రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల జాతర అంబరాన్ని తాకింది. అటు తమ్ముళ్లు.. ఇటు ఫ్యాన్ పార్టీ నేతలు.. జనసేన, బీజేపీ కేడర్ నామినేషన్ల పర్వంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. 28 జిల్లాల్లోని 9,829 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. ఏకంగా 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి! అటు 659 జెడ్పీటీసీ స్థానాల కోసం..5,724 నామినేషన్లు పడ్డాయంటే గ్రౌండ్ లెవెల్లో ఫైట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డే నామినేషన్ల జాతర అయితే నెక్స్ట్ లెవెల్! ఒక్క చివరి రోజే జెడ్పీటీసీ స్థానాలకు 3,315.. ఎంపీటీసీ స్థానాలకు 25,016 నామినేషన్లు దాఖలు చేసి పార్టీలు పవర్ చూపించాయి.
MPTCల్లో 22,013 నామినేషన్లతో టీడీపీ టాప్‌లో ఉంటే..20,556 నామినేషన్లతో వైసీపీ గట్టి పోటీ ఇస్తోంది. జనసేన నుంచి 4,609 మంది, బీజేపీ నుంచి 1,150 మంది బరిలోకి దిగారు. జెడ్పీటీసీ రేసులోనూ అంతే! టీడీపీ 2,078, వైసీపీ 1,815, జనసేన 679, బీజేపీ 255 నామినేషన్లు దాఖలు చేశాయి. కానీ.. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది! క్షేత్రస్థాయిలో వైసీపీ అభ్యర్థులు ఇంత భారీగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తుంటే.. వైసీపీ మాత్రం నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ ఆరోపిస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
జగన్‌ది అంతా హిట్ అండ్ రన్ థియరీ అని చంద్రబాబు విమర్శించారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడం..అమరావతిలో ల్యాండ్ అవ్వడం.. ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేయడమే జగన్ పని విమర్శించారు సీఎం. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడానికే జగన్ అమరావతి వస్తున్నారా? అంటూ కూటమి పార్టీలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్రౌండ్లో నామినేషన్ల ఊపు చూస్తుంటే ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తోందని స్పష్టమవుతుంటే.. జగన్ ఆరోపణల వెనుక ఆంతర్యం ఏంటి? కూటమి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
