రాజకీయాల్లో టెక్నాలజీని వాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది. ఇప్పుడు అదే టెక్నాలజీతో పార్టీ క్యాడర్‌ను అధినేతకు మరింత చేరువ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపించేందుకు తీసుకొచ్చిన ‘మైటీడీపీ’ యాప్ ఇప్పుడు 10 లక్షల మంది కార్యకర్తలతో ఒక పెద్ద డిజిటల్ సైన్యంగా మారింది. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? సామాన్య కార్యకర్తకు ఇది ఏ విధంగా అండగా నిలుస్తోంది?
ఒకప్పుడు మారుమూల గ్రామంలో పార్టీ జెండా మోసే సామాన్య కార్యకర్త కష్టం అధిష్ఠానానికి తెలియాలంటే చాలా సమయం పట్టేది. మధ్యలో నాయకుల ద్వారా వెళ్తే తప్ప, అసలు క్షేత్రస్థాయిలో ఎవరు కష్టపడుతున్నారో తెలిసేది కాదు. కానీ, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిన ‘మైటీడీపీ’యాప్ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా, ఈ యాప్‌లో నమోదైన కార్యకర్తల సంఖ్య 10 లక్షల మైలురాయిని దాటింది. ఇదొక డిజిటల్ వారధి. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలైనా, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవడమైనా, సేవా కార్యక్రమాలైనా.. కార్యకర్త తాను చేసిన ప్రతి పనిని ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏ నియోజకవర్గంలో, ఏ బూత్‌లో ఎవరు చురుగ్గా పనిచేస్తున్నారనే పూర్తి డేటా నేరుగా పార్టీ అధిష్ఠానం కళ్లముందే ఉంటోంది.
దీని ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతోమంది సామాన్య కార్యకర్తలకు సర్పంచులుగా, కార్పొరేటర్లుగా అవకాశాలు దక్కాయి. నామినేటెడ్ పదవుల్లోనూ కష్టపడే వారికే పెద్దపీట వేస్తున్నారు.ఇక ఈ యాప్‌లో కార్యకర్తలను బాగా ఆకట్టుకుంటున్న ఫీచర్ ‘ఫోటో బూత్’. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు కార్యకర్తలు వారితో ఫోటోలు దిగుతుంటారు. యాప్‌లో ఒక్కసారి తమ ముఖాన్ని స్కాన్ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఎప్పుడు అధినేతతో ఫోటో దిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆ ఫోటోలు నేరుగా వాళ్ల యాప్‌లోని ఫోటో బూత్‌లోకి వచ్చేస్తాయి. అంతేకాదు, శిక్షణా తరగతుల హాజరు, డిజిటల్ మహానాడు నిర్వహణ, కార్యకర్తల ఆరోగ్యం, సంక్షేమం.. ఇలా అన్నీ ఈ ఒక్క యాప్‌తోనే ముడిపడి ఉన్నాయి.
ఈ యాప్ వినియోగంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు టాప్-5లో ఉండగా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం ముందువరుసలో నిలిచాయి. లోకేష్ తన పర్యటనల్లో యాప్ ద్వారా టాస్కులు పూర్తి చేసిన కార్యకర్తలకు స్వయంగా ప్రశంసాపత్రాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ యాప్ వినియోగంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు టాప్-5లో ఉండగా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం ముందువరుసలో నిలిచాయి. లోకేష్ తన పర్యటనల్లో యాప్ ద్వారా టాస్కులు పూర్తి చేసిన కార్యకర్తలకు స్వయంగా ప్రశంసాపత్రాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.
కేవలం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మాత్రమే కాకుండా, కార్యకర్తల ప్రతిభకు గుర్తింపునిచ్చి, వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక సమగ్ర వేదికగా ‘మైటీడీపీ’ మారింది. 10 లక్షల మంది ఒకే పసుపు కుటుంబంగా మారడం టీడీపీ సంస్థాగత బలానికి నిదర్శనం. ‘కార్యకర్తే పార్టీకి బలం.. ఆ కార్యకర్తకు బలం మైటీడీపీ’ అనే మాట ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిజమవుతోంది.
కార్యకర్తే అధినేత.. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి బలం..బలగం. పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదైన మన కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలి. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలి. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత అవకాశాలు దక్కాలి. ఈ లక్ష్యంతోనే మైటీడీపీ యాప్‌కు శ్రీకారం చుట్టాం. ఈ ప్రయాణంలో భాగస్వాములైన 10 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు.
@MyTDPOfficial— Lokesh Nara (@naralokesh) November 25, 2026
